మళ్లీ గోదారి వరద
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:23 AM
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): గోదావరి వరద మళ్లీ పెరిగింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఈనెల 27న జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను సోమ వారం 6 గంటలకు ఉపసంహరించుకున్నా రు. అయితే రాత్రి 7గంటల నుంచి మళ్లీ పెరు గుదల కనిపించింది. ఎగువన కురిసిన వర్షాల వల్ల భద్రాచలం నీటిమట్టం కూడా పెరుగుతోంది. ఇరిగేషన్ అధికార్ల కథనం ప్రకారం.. భద్రాచలం వద్ద నీటిమట్టం మొదటి ప్రమాద
భద్రాచలం వద్ద 45 అడుగులు దాటిన నీటిమట్టం
ధవళేశ్వరం వద్ద రాత్రి 7 గంటల నుంచి పెరుగుదల
రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): గోదావరి వరద మళ్లీ పెరిగింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఈనెల 27న జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను సోమ వారం 6 గంటలకు ఉపసంహరించుకున్నా రు. అయితే రాత్రి 7గంటల నుంచి మళ్లీ పెరు గుదల కనిపించింది. ఎగువన కురిసిన వర్షాల వల్ల భద్రాచలం నీటిమట్టం కూడా పెరుగుతోంది. ఇరిగేషన్ అధికార్ల కథనం ప్రకారం.. భద్రాచలం వద్ద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికను దాటి 45 అడుగులకు పైగా పెరుగుతోంది. ఇది 48 అడుగులకు చేరితే అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రాత్రి 7గంటలకు నీటి మట్టం 11.70 అడుగులుగా ఉంది. ఇది 11.75కి చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. ఈసారి ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి 9,77,625 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేసి ఉన్నాయి. ఇక ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని తూర్పు డెల్టా కాలువలకు 3900 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టా( కోనసీమ)కు 2100 క్యూసెక్కులు, పశ్చిమ డెలా ్టకు 6500 క్యూసెక్కులు మొత్తం 12,500 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రా చలం దిగువ నుంచి పోలవరం ప్రాజెక్టు మీదు గా ధవళేశ్వరం బ్యారేజీ వరకూ ఉన్న అఖండ గోదావరి ఉధృతి మరింత పెరిగింది. గోదావరి ఘాట్లలో వరద ఉధృతి ఉండడం వల్ల, ఇటీవల ఇద్దరు భక్తులు గల్లంతు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, గోదావరి స్నానాలకు ఎవరినీ వెళ్లనీయకుండా కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా లంకలలోకి నీరు బాగా పె రుగుతోంది. రాజమండ్రి లంకల్లోని మత్స్యకార కు టుంబాలను పునరావాసకేంద్రాలకు తరలించారు.
ముంపులో మిర్చిపంట
ఎటపాక, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో వారం క్రితమే రైతులు మిర్చిపంటను సాగు చేశారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో మిర్చితోటలన్నీ వరదముంపులో చిక్కుకున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 2రోజులు గా భద్రాచలం- కూనవరం రోడ్‌లో మురుమూరు వద్ద రహదారి ముంపులో చిక్కుకోవడంతో ఇటు వైపుగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే నెల్లిపాక- వీరాయిగూడెం గ్రామాల మధ్యలో రహదారిపై వరదనీటి తో రాకపోకలు ఆగిపోయాయి.