Share News

మళ్లీ పెరుగుతున్న వరద

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:44 AM

చింతూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరి, శబరి నదులు మళ్లీ పెరుగుతు న్నాయి. దీంతో లోతట్టువాసులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 44.7 అడుగుల మేర ప్రవహిస్తోంది. కూనవరం వద్ద గోదావరి నది శబరి నదికి ఎగపోటు

మళ్లీ పెరుగుతున్న వరద
ఉధృతంగా ప్రవహిస్తున్న సోకిలేరు వాగు వద్ద వాహనాదారుల పాట్లు

భద్రాచలం వద్ద

44.7 అడుగుల నీటిమట్టం

చింతూరు డివిజన్‌లో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

అప్రమత్తంగా ఉండాలి : పీవో

చింతూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరి, శబరి నదులు మళ్లీ పెరుగుతు న్నాయి. దీంతో లోతట్టువాసులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 44.7 అడుగుల మేర ప్రవహిస్తోంది. కూనవరం వద్ద గోదావరి నది శబరి నదికి ఎగపోటు నివ్వడంతో శబరి ఉధృ తి కూడా పెరుగుతోంది. దీంతో చింతూరు- వరరామ చంద్రపురం మండలాల నడుమ సోకిలేరు వాగు ఉధృతి పెరిగింది. ఈ క్రమ ంలో అటుగా రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలోని కోండ్రాజపేట, టేకులబోరు నడుమ, వరరామ చంద్రపురం మండలంలో తుష్టివారిగూదెం అడవి వెంకన్నగూడెం నడుమ చింతరేవుపల్లి కన్నయ్యగూడెం నడుమ, ఎటపాక మండలం లోని నెల్లిపాక వీరాయిగూడెంల నడుమ కన్యాయిగూడెం గట్టుగూడెంల నడుమ చింతూరు మండలం, వరరామచంద్రపురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయా యి. దీంతో లోతట్టు వాసులు అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్‌ పేర్కొన్నారు. చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని ఆయన సూచించారు.

వరద నీటిలోనే గండిపోశమ్మ ఆలయం

దేవీపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి క్రమేపి పెరుగుతోంది. ముంపు పరివాహ ప్రాంతాలకు వరద నీరు చేరుతుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మాతశ్రీ గండిపోశమ్మ అమ్మ వారి ఆలయ పైభాగం వరకు వరద నీరు చేరింది. పాపికొండలు వెళ్లే పర్యాటక బోట్లు వరదల కారణంగా నిలిపివేశారు.

Updated Date - Sep 27 , 2025 | 12:44 AM