నిదానంగా పెరుగుతున్న గోదావరి
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:21 AM
ధవళేశ్వరం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నిదానంగా పెరుగుతూ ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 9గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 11.75 అడుగులకు చేరుకుంది. ఆపై కొన్ని గంటల పాటు నిలకడగా ఉ ండి 2,3 గంటలకు ఒక పాయిం
కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
11,35,249 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
ధవళేశ్వరం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నిదానంగా పెరుగుతూ ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 9గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 11.75 అడుగులకు చేరుకుంది. ఆపై కొన్ని గంటల పాటు నిలకడగా ఉ ండి 2,3 గంటలకు ఒక పాయింట్ చొ ప్పున పెరుగుతూ ఆదివారం మధ్యా హ్నం 4గంటలకు 12.80 అడుగులకు చేరుకుంది. రాత్రి 7గంటలకు అదే రీడి ంగ్ వద్ద నిలకడగా కొనసాగింది. ఈ సమయంలో కాటన్ బ్యారేజ్ నుంచి 11,35,249 క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. వ్యవసాయ అవసరాల కోసం తూర్పు డెల్టాకు 4700 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2300 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5500 క్యూసెక్కులు చొప్పు న సాగునీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువున భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం 8గంటలకు నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆపై ఒక పాయింట్ మాత్రమే పెరిగి 48.10 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఎగువున కాళేశ్వరం, పేరూరు వద్ద నీటి మట్టం తగ్గుతుండగా దిగువున దుమ్ముగూడెం, భద్రాచలం, కూ నవరం, కుంట, పోలవరం వద్ద నిలకడగా ఉంది.