Share News

గోదావరి బతుకులు!

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:50 AM

గోదారమ్మ ఒడిలో ఆటుపోటుల జీవనం. ఏళ్ల తరబడి లంకావాసం.. గోదారమ్మ ఉగ్రమైన రోజుల్లో నగరంలో ఏడాదికోమారు పునరావాసం.మనుషులు పునరావాస కేంద్రంలో..

గోదావరి బతుకులు!

వరదొస్తే ఊరు పొమ్మంటుంది

పునరావాస కేంద్రం రమ్మంటుంది

ఏళ్లుగా తీరని మత్స్యకారుల వేదన

సొంతిళ్లివ్వాలని డిమాండ్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదారమ్మ ఒడిలో ఆటుపోటుల జీవనం. ఏళ్ల తరబడి లంకావాసం.. గోదారమ్మ ఉగ్రమైన రోజుల్లో నగరంలో ఏడాదికోమారు పునరావాసం.మనుషులు పునరావాస కేంద్రంలో.. ఇంట్లో సామగ్రి పడవలో..వరద తగ్గిన తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లే సరికి మిగిలేది బురద.. రగిలేది ఆవేదన. గత 30 ఏళ్లుగా ఆరు లంక గ్రామాల్లో వెయ్యి కుటుంబాలు జీవనం సాగిస్తున్నా.. వరద వేళ ఇదీ లంకల్లోని మత్స్యకార జీవితాల కథా చిత్రమ్‌. గోదారమ్మ చల్లని ఒడి.. అదే వారి బతుకు బడి.. ఇది ఏడాదిలో 10 నెలలు మాత్రమే.. వర్షాకాలం సీజన్‌ ఆరంభమైందా.. బతుకు కుదు రు ఉండదు..గోదావరి వరద పెరుగుతూ ఉంటే..గూడు వదలాల్సిందే.. పునరావాస కేం ద్రం వైపు దౌడ్‌ తీయాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాలోని లంకల్లో జీవనం సాగించే మత్స్య కారులు వర్షాకాలం, వరదల సమయంలో నరకం అనుభవిస్తారు. వరద నీరు ఉప్పొం గుతూ ఇంటి వైపు వస్తూ ఉంటే ఒకటే ఆం దోళన. ప్రధానంగా రాజమహేంద్రవరం గోదా వరి పరిసర ప్రాంతంలోని లంకల్లో ఏళ్ల తరబడి బతుకు నావను లాగుతున్న వందల కుటుం బాల్లో ఏడాదికోమారు అలజడి తప్పదు.

లంకల్లో వెయ్యి మంది..

గోదావరి మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన ఎదుర్లమ్మలంక, కేతావారిలంక, బ్రిడ్జిలంక, గౌత మిఘాట్‌ లంక తదితర మరో రెండు లంకల్లో వెయ్యి మంది వరకూ మత్స్యకారులు 30 ఏళ్లకు పైబడి నివాసం ఉంటున్నారు.గోదావరిలో చేపల వేట వీరి జీవనాధారం. కుటుంబం అంతా కష్టపడి ఏడాదిలో 10 నెలలు ఎంతో హాయిగా గడిపేస్తారు.ఏడాదిలో వరదలు సమీపించే రెం డు నెలలు నరకం చూస్తారు. ఎందుకంటే 10 నెలలు నివాసం ఉన్న ఆవాసాలను వదిలి నగ రం వైపు వస్తారు. పునరావాస కేంద్రాల్లో తల దాచుకుంటారు.ఇళ్లలోని కొద్దిపాటి సామగ్రి పడ వల్లో ఉంచి టార్ఫాలిన్లు కడతారు. గోదావరి శాంతించిన తర్వాత ఇళ్లకు వెళితే మరో నరకం కనిపిస్తుంది. ఇంటా, బయటా బురద అడుగుల మేర మేట వేసి ఉంటుంది. వరదలో కొట్టుకు పోగా మిగిలిన సామాన్లను ఒబ్బిడి చేసుకుంటా రు.కొందరివి ఇళ్లు గోదాట్లో కలిసిపో తుంటాయి. మళ్లీ అప్పోసప్పో చేసి గూడు కట్టుకుంటారు.

పునరావాసానికి 500 మంది

మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పునరా వాసం కల్పించి తోడుగా నిలుస్తోంది. గత వైసీ పీ ప్రభుత్వంలో లంకలు పూర్తిగా మునిగి పోయే స్థితికి చేరే వరకూ పట్టించుకునే వారే కానరాలేదు. కూటమి ప్రభుత్వంలో వరద లంక గట్లను తాకగానే పడవల్లో జాగ్రత్తగా మత్స్య కారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నా రు.ఇలా ఈ ఏడాది 500 మంది వరకూ మత్స్య కారులను అల్కట్‌తోట మునిసిపల్‌ కల్యాణ మండపం, చందా సత్రానికి సుర క్షితంగా చేర్చా రు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. వైసీపీ ప్రభు త్వంలో వీటికి రోజుకు రూ.320 ఉండగా కూటమి ప్రభుత్వం రూ.350 చేసింది. నాణ్య మైన ఆహారం అందించాలని ఆదేశించింది. పిల్ల లకు పాలు, స్నాక్స్‌ ఇస్తున్నారు. వైసీపీ ప్రభు త్వం రూ.2వేల చొప్పున పరిహారం ఇస్తే.. కూటమి ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలు రెట్టింపు చేసి రూ.3 వేలు చేతిలో పెడుతోంది. ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఒక కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, ఒక లీటరు వంట నూనెను గతేడాది అందజేశారు. ఇప్పుడూ అదే మాదిరిగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు పునరావాస కేంద్రంలో తలదాచుకోగా.. మగవారు పడవలకు కాపలాగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక్కో ఇం జను బోటు సుమారు రూ.3 లక్షలు ఖరీదు చేస్తుంది. వరద ఉధృతికి ఎక్కడ కొట్టుకుపో తుందోననే భయంతో గోదావరి వద్దే కాపలాగా ఉంటున్నారు. ఒక్కో పూట తిండి లేకపోయినా పడవలే జీవనాధారం కావడంతో వాటి వద్దే కనిపెట్టుకొని ఉంటున్నారు. పునరావాస శిబిరా లను కలెక్టర్‌ పి.ప్రశాంతి ఎప్పటికప్పుడు పరిశీ లిస్తున్నారు. శుక్రవారం ఆల్కట్‌తోట సమీపం లోని కల్యాణ మండపాన్ని సందర్శించారు. మత్స్యకారుల కోరిక మేరకు అక్కడే వారికి నచ్చి న శాకాహారం వండి వడ్డించాలని ఆదేశించారు.

గూడు కల్పిస్తే..

లంకల్లో మత్స్యకారులకు వేట ఒకటే జీవనా ధారం. రోజూ వేట సాగించి వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తారు. వరదల వేళ పడవలు ఒడ్డుకు చేరక తప్పదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ప్రతి ఏడాదీ ఈ నరకం తప్ప డం లేదని.. నగర పరిధిలో గోదావరి సమీ పంలో తమకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు.ఈ లంకల్లో నివసి స్తున్న వారిలో కొందరు యానాం నుంచి ఉపాధి కోసం వచ్చి స్థిరపడిన వాళ్లు ఉన్నారు. వారికి రేషన్‌ కార్డు, ఆధార్‌ వగైరాలు యానాంలో ఉం టాయి. దీంతో మత్స్యకారులకు సొంత గూడు కల్పించడం అనేది జరగడంలేదు. ఇకనైనా సర్వే చేపట్టి లంకల్లోని మత్స్య కారులను నగరం లోకి తీసుకురావాల్సిన అవసరత కనిపిస్తోంది.

ఇవీ కావాలి..

పునరావాస కేంద్రాల్లో ఉదయం రెండు రకాలతో టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రికి స్వీటు, కూర, పప్పు, వేపుడు, సాం బారు, పెరుగు, పచ్చడితో భోజనం వడ్డిస్తున్నారు. అయితే మత్స్యకారులు మాంసాహారం ఎక్కువగా తీసు కుంటారు. వారంలో కనీసం రెండు మూడు మార్లయినా భోజనంలో ఏదైనా మాంసాహారం ఉండాలని కోరుతున్నారు.పునరావాస కేంద్రాల్లో టీవీలు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు. గతేడాది గర్భిణులు, వృద్ధులకు మంచాలు ఏర్పా టు చేశారు. సామగ్రి పెట్టుకోడానికి అల్మారాలు పెట్టారు. కానీ ఈ ఏడాది వాటిని మరిచారు.

Updated Date - Aug 23 , 2025 | 01:50 AM