Share News

తగ్గని గోదావడి!

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:43 AM

గోదావరి ఇంకా ఉధృతం గానే ప్రవహిస్తోంది. అఖండ గోదావరి ఘాట్లన్నీ వరద నీటితో నిండి ఉన్నాయి.

తగ్గని గోదావడి!

ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి

కొనసాగుతున్న ఫస్ట్‌ వార్నింగ్‌

మరో రెండు రోజులు వరద

ఎగువున వర్షాలే కారణం

రాజమహేంద్రవరం/కొవ్వూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గోదావరి ఇంకా ఉధృతం గానే ప్రవహిస్తోంది. అఖండ గోదావరి ఘాట్లన్నీ వరద నీటితో నిండి ఉన్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. అఖండ గౌతమీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. స్నానఘట్టాల మెట్లను ముంచుతూ, సుడులు తిరుగుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో స్నానఘట్టాలపై ఉన్న శివలింగాలను వరద ముంచెత్తింది. భద్రాచలం నుంచి వరద ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజ్‌కు చేరుకోవడానికి 18 గంటల సమయం పడుతుంది.ధవళేశ్వరం వద్ద నెమ్మదిగా తగ్గుము ఖం పడుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లోనే ఉంది. బ్యారేజీ వద్ద ఆదివా రం ఉదయం 6 గంటలకు 12.50 అడుగులుగా ఉన్న నీటిమట్టం నెమ్మదిగా తగ్గుతూ రాత్రి 8 గంటలకు 12 అడుగులకు చేరింది.సోమవారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఎత్తి వేసే అవకాశం ఉంది.బ్యారేజి నుంచి దిగువకు 10 లక్షల, 9 వేల 208 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరం పుష్క రఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ఇద్దరు భవానీ మాలధారులు గల్లంతు కావ డంతో ఘాట్ల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రమాద హెచ్చరిక ఎత్తివేసినా ఇంకా కనీసం రెండు రోజుల పాటు ఈ ఉధృతి కొనసాగే అవ కాశం ఉన్నట్టు అధికారులు చెబు తున్నారు.

ఇంకనూ లభించని ఆచూకీ

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 28( ఆంధ్రజ్యోతి): పుష్కరాల రేవు వద్ద గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన భవానీమాలధారుల కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది,మత్స్యకారుల సహకారంతో గాలింపు చేపట్టినా ఫలితం లేక పోయింది.మాలధారులు వీరబాబు, బాపిరాజు శనివారం సాయంత్రం గోదావరిలో గల్లంతైన విషయం విధితమే. ఆచూకీ లభ్యం కాకపో వడంతో పుష్కరాల రేవు వద్ద వారి బంధువులు గల్లంతైన వారి కోసం ఎదురుచూస్తున్నా రు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఆదివారం రాత్రి వరకు రాలేదు. గోదావరి వరద ఉధృతి ఎక్కు వగా ఉండడంతో పుష్కరాల రేవు నుంచి దిగువకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.పుష్క రఘాట్‌ను ఆదివారం రాజమహేంద్రవరం, అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌,నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు.గోదావరికి వరద ఎక్కువగా ఉన్నందువల్ల స్నానాలకు వచ్చే భక్తులు మునిసిపల్‌ అధికారులు ఏర్పాటు చేసి న ట్యాప్‌ల వద్ద స్నానాలు చేయాలని తెలి పారు.అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

Updated Date - Sep 29 , 2025 | 01:43 AM