గోదావరిలో స్నానాలు నిషేధం
ABN , Publish Date - May 06 , 2025 | 01:00 AM
వేసవి కావ డంతో కాటన్‌బ్యారేజీ దిగువన మద్దూరు వద్ద ప్రతి రోజూ పెద్దలు.. చిన్నారులు కుటుం బాలతో సహా వచ్చి వందలాది మంది స్నానాలు ఆచరిస్తు న్నారు. ఇది ప్రమాదమని చెప్పినా జనం మాత్రం మాటవినడంలేదు.ఈ నేప థ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
కొవ్వూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : వేసవి కావ డంతో కాటన్‌బ్యారేజీ దిగువన మద్దూరు వద్ద ప్రతి రోజూ పెద్దలు.. చిన్నారులు కుటుం బాలతో సహా వచ్చి వందలాది మంది స్నానాలు ఆచరిస్తు న్నారు. ఇది ప్రమాదమని చెప్పినా జనం మాత్రం మాటవినడంలేదు.ఈ నేప థ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని సీతంపేట, మద్దూరులంక బ్యారేజ్ ప్రాంతాల్లో గోదావరిలో స్నానమాచరించడంపై నిషేఽధం విధి ంచారు. అనుమతి ఉన్న స్నానఘట్టాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే గోదావరి స్నానాలు చేయాలని సూచించారు.అనుమతిలేని ప్రదేశాల్లో స్నానమాచరించడానికి దిగవద్దని కొవ్వూరు తహశీల్దార్ ఎం.దుర్గాప్రసాద్ సూచించారు.మద్దూరులంక బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో దిగకుండా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోదావరి నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్నానమాచరించడం ప్రమాదకరమన్నారు.నిబంధనలు అతిక్రమించి అనుమతిలేని ప్రదేశాల్లో స్నానం చేస్తే చర్యలు తప్పవన్నారు.