Share News

అయోధ్య రాముడికి సమర్పించే ధనస్సుకు పూజలు

ABN , Publish Date - May 05 , 2025 | 12:26 AM

హైదరాబాదుకు చెందిన చల్లా శ్రీనివాసశాస్త్రి ఆర్ధిక సహకారంతో అయోధ్య రాముని కోసం ఒక కేజీ వెండి, 13 కేజీల వెండితో ధనస్సు, బాణం, గద తయారు చేయించారు.

  అయోధ్య రాముడికి సమర్పించే ధనస్సుకు పూజలు

కాట్రేనికోన, మే 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాదుకు చెందిన చల్లా శ్రీనివాసశాస్త్రి ఆర్ధిక సహకారంతో అయోధ్య రాముని కోసం ఒక కేజీ వెండి, 13 కేజీల వెండితో ధనస్సు, బాణం, గద తయారు చేయించారు. వీటికి ఆదివారం పార్వతీకుండలేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్యలో రామునికి సమర్పించనున్నట్టు చల్లా శ్రీనివాసశాస్త్రి తెలిపారు. గతంలో పాదాలు బహూకరించామన్నారు.

Updated Date - May 05 , 2025 | 12:26 AM