ఘనంగా స్వాతి నక్షత్రపూజలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:33 AM
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు జరిపారు.
అంతర్వేది, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు జరిపారు. తొలుత అర్చకులు బంగారు కలశను శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేశారు. ముందుగా 108కలశాలతో విశేష అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ పురాతన కల్యాణ మండపం వద్ద అష్టోత్తర శత కలశాభిషేకం చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.