ఘనంగా సదస్యం
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:12 AM
ర్యాలి జగన్మోహిని కేశవస్వామి క్షేత్రపాలకుడు గోపాలస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారికి నిత్యార్చన, అమ్మ వారికి కుంకుమార్చన, సాయంత్రం నిత్యోపసన, బలిహరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

ఆత్రేయపురం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి క్షేత్రపాలకుడు గోపాలస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారికి నిత్యార్చన, అమ్మ వారికి కుంకుమార్చన, సాయంత్రం నిత్యోపసన, బలిహరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి సదస్యం (మహాదాశీర్వచనం) నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తు లు పాల్గొనగా, ఆలయ ఈవో బీహెచ్వీ రమణమూర్తి వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.