ఘనంగా సోమేశ్వరస్వామి రథోత్సవం
ABN , Publish Date - May 12 , 2025 | 12:56 AM
మండలంలోని సోమేశ్వరం బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రథోత్స వాన్ని నిర్వహించారు.
రాయవరం, మే 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని సోమేశ్వరం బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రథోత్స వాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో గంధం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్చకుడు పరిటాల సుబ్రహ్మాణ్యశర్మ అర్చకత్వంలో స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ జరిపి అర్చ నలు, హారతులు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి రథోత్సవాన్ని నిర్వహించారు. సోమేశ్వరం పరిసర ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శిం చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైఆర్కే పరమహంస, రావుల రామకృష్ణ, పలువురు కూటమి నాయకులు, ఆలయ సిబ్బంది పి.వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.