Share News

వైభవంగా స్వామివార్లకు సదస్యం

ABN , Publish Date - May 11 , 2025 | 01:29 AM

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఉపాలయంలో ఉన్న శ్రీరమాసత్యనారాయణస్వామి దివ్య కల్యాణో త్సవంలో భాగంగా శనివారం స్వామివారికి నిత్యార్చన, అమ్మవారికి కుంకుమ పూజ, సాయంత్రం నిత్య ఉపాసన, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

వైభవంగా స్వామివార్లకు సదస్యం

ఆత్రేయపురం, మే 10(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఉపాలయంలో ఉన్న శ్రీరమాసత్యనారాయణస్వామి దివ్య కల్యాణో త్సవంలో భాగంగా శనివారం స్వామివారికి నిత్యార్చన, అమ్మవారికి కుంకుమ పూజ, సాయంత్రం నిత్య ఉపాసన, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనం తరం స్వామివారికి సదస్యం కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ర్యాలి ఉమా కమండలేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శివుడికి అభి షేకాలు, అమ్మవారికి కుంకుమార్చన అనంత రం రాత్రి మహదాశీర్వచనం, నీరాజన మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో భక్తజనం పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి బీహెచ్‌వీ రమణమూర్తి ఏర్పాట్లు నిర్వహించారు.

Updated Date - May 11 , 2025 | 01:29 AM