Share News

వెంకటేశ్వరస్వామి కల్యాణానికి రాట ముహూర్తం

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:03 AM

కోటిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలు వచ్చేనెల 6 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు టీడీపీ సీనియర్‌ నాయకుడు రేవు శ్రీను తెలిపారు.

వెంకటేశ్వరస్వామి కల్యాణానికి రాట ముహూర్తం

కె.గంగవరం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కోటిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలు వచ్చేనెల 6 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు టీడీపీ సీనియర్‌ నాయకుడు రేవు శ్రీను తెలిపారు. గురువారం ఆలయం వద్ద ఆయన కమిటీ సభ్యులతో కలసి ఉదయం 8.46 గంటలకు రాట ముహూర్తం చేశారు. నేటి నుంచి కల్యా ణోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పెమ్మాడి సత్తిబాబు, అయినవిల్లి సూరిబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 01:03 AM