జీతం బకాయిలు ఇవ్వరా!?
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:09 AM
చిరుద్యోగులని జాలి లేదు.. మహిళలనే దయ అంతకంటే లేదు.. ఇదీ మహిళా సఫాయి వాలా ల పట్ల రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థ అనుసరిస్తున్న తీరు. అధికారులు ఏ పని చెప్పి నా కాదనకుండా రెక్కలు ముక్కలు చేసుకుం టున్నా చిన్నపాటి బకాయిలు చెల్లించడానికి కూడా ప్రదక్షిణలు చేయించుకోవడం ఆక్షేపణీ యంగా కనిపిస్తోంది.
మహిళా సఫాయి వాలాల ఎదురుచూపులు
అధికారుల చుట్టూ ఏడాదిగా.. 25 మంది మహిళల ప్రదక్షిణాలు
రాజమహేంద్రవరం, జూలై 12(ఆంధ్రజ్యోతి): చిరుద్యోగులని జాలి లేదు.. మహిళలనే దయ అంతకంటే లేదు.. ఇదీ మహిళా సఫాయి వాలా ల పట్ల రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థ అనుసరిస్తున్న తీరు. అధికారులు ఏ పని చెప్పి నా కాదనకుండా రెక్కలు ముక్కలు చేసుకుం టున్నా చిన్నపాటి బకాయిలు చెల్లించడానికి కూడా ప్రదక్షిణలు చేయించుకోవడం ఆక్షేపణీ యంగా కనిపిస్తోంది. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్లో 25 మంది మహిళా పారిశుధ్య కార్మి కులు పనిచేస్తున్నారు.వీళ్లను కాంట్రాక్టరు ద్వారా నియమించుకోగా.. హెల్త్ ఇన్స్‌పెక్టర్ ప్రతి రోజూ పని పురమాయించుకొంటారు. టాయిలెట్ల క్లీనింగ్ దగ్గర నుంచీ చెత్తను లారీలోకి ఎత్తడం వరకూ అన్నీ వీళ్లే షిఫ్టుల వారీగా చేస్తారు. రాత్రి వేళల్లో కూడా ఇద్దరు విధుల్లో ఉంటారు. అయితే వీళ్లకు జీతాలను మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. 2023లో మూడు నెలల జీతం బకాయి పడగా ‘ఆంధ్రజ్యోతి’ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రంగం లోకి దిగడంతో కాంట్రాక్టరు జీతాలు చెల్లించారు. తర్వాత ఆ కాంట్రాక్టు సంస్థ నిబంధనల ప్రకారం నడుచు కోకపోవడాన్ని కూడా ‘ఆంధ్రజ్యోతి’ బహిర్గత పరచగా కాంట్రాక్టును రైల్వే రద్దు చేసింది. మరొక సంస్థకు రైల్వే స్టేషను పారిశుధ్య పనులను అప్పగించింది. అయితే పాత కాం ట్రాక్టరు 2024 జూలై నుంచి అక్టోబరు వరకూ పారిశుధ్య కార్మికులకు జీతాలు బకాయి పడ్డారు. వాటి గురించి ఏ అధికారికి విన్నవించినా ఫలితం శూ న్యమవుతోంది. ఉన్నతాధికారులు వచ్చి నప్పుడు గోడు వినిపించుకుం దామంటే వా రి సమీపా నికి కూడా వీళ్లను వె ళ్లనీయడం లేదు. కార్మి కుల కోసం ప నిచేసే రైల్వే లే బర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి విన్నవిస్తే.. ఆ కాంట్రాక్టరుకు రైల్వేకి మధ్య వివాదాలు ఉన్నాయని, అవి కోర్టులో తేలితే గానీ జీతాల బకాయిలు చెల్లించరంటూ కాంట్రాక్టరుకు వత్తాసుగా సమాధానం ఎదురైంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం జీతాలను క్రమం తప్పకుండా కాంట్రాక్టరు చెల్లించాలి. కానీ ఏడాది కావస్తున్నా పాత బకాయిలు ఇవ్వడం లేదు. కాంట్రాక్టు సంస్థకు రైల్వేకు కోర్టులో నడుస్తున్న కేసులకు తమ జీతాలకు ముడి పెట్టడం ఎంత వరకూ సమంజసమని మహిళా పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. ఒకవేళ గట్టిగా నిలదీస్తే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో కనబడిన అధికారిని బ్రతిమలాడుకోవడం తప్ప గత్యంతం ఉండడం లేదని అంటున్నారు. ఒక్కోసారి పోలీ సులను ప్రయోగించి మరీ భయపెడుతున్నా రని..మళ్లీ డీఎల్‌ఎస్‌ఏ, కార్మిక సంక్షేమ అధికా రులు కల్పించుకొని తమ జీతం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మహిళా పారిశుధ్య కార్మికులు వేడుకొంటున్నారు.