Share News

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:45 AM

సమాన పనికి సమాన వేతనం ఇవ్వా లని 45రోజులగా నిరసన దీక్షలు చేస్తున్న మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు ఆదివారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కార్మికులు వారి కుంటుంబాల తో కలిసి నిరసన చేపట్టారు.

 సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
ధర్నా చేస్తున్న మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు

  • రాజమహేంద్రవరంలో మునిసిపల్‌ కార్మికుల నిరసన

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 22(ఆంధ్ర జ్యోతి): సమాన పనికి సమాన వేతనం ఇవ్వా లని 45రోజులగా నిరసన దీక్షలు చేస్తున్న మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు ఆదివారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కార్మికులు వారి కుంటుంబాల తో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కార్మికుడి భార్య ఎస్‌.సుధారాణి మాట్లాడుతూ తన భర్తకు నెలకు రూ.15 వేలు జీతమని, రూ.2 వేలు కటింగ్‌లు పోను రూ.13 వేలు చేతికి ఇస్తున్నారని, ఈ మొత్తాన్ని ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, నిత్యావసరాలు, పిల్లల చదువులకు సర్దలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే ప్రభుత్వం ఉద్యోగమే అయినా జీతం అరకొరేనని అన్నారు. ఉద్యోగి వై.సత్తిరాజు మాట్లాడుతూ దివ్యాంగుడైన తన కుమారుడికి 2014-19లో నాటి సీ ఎం చంద్రబాబు దివ్యాంగ పెన్షన్‌ ఇచ్చే వారని 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక దానిని తొలగించారన్నారు. ఇటు జీతాలు పెం చక అటు పింఛన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్మికుల పిల్లలు పవన్‌, చం ద్రశేఖర్‌ మాట్లాడుతూ తమ తండ్రులు ప్రభుత్వ ఉద్యోగులనే కారణంతో చదువుకుంటున్న తమకు తల్లికి వందనం సొమ్ములు పడలేదన్నా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు అందడం లేదన్నారు. నిరసనలో కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల ఏసు బాబు, బుంగ యేషయారాజు, కోటాని ముకుం దరామ్‌, సిరికి ప్రసాద్‌, పాలిక బాల భవానీకు మార్‌, మందనక్క సాయి, బొక్కా శ్రీను, వెదురుపర్తి ఏసు, బండారు గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:45 AM