Share News

నమ్మొద్దు..నమ్మొద్దు!

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:29 AM

స్వాతంత్రం.. స్వేచ్ఛ.. రెండిటికీ మధ్య యోజనాల వ్యత్యా సం ఉందని పెద్దలు చెప్పే మాట అక్షర సత్యమని ఛిద్రమ వుతున్న బాలికలు/అమ్మాయి ల జీవితాలు రుజువు చేస్తున్నాయి.

నమ్మొద్దు..నమ్మొద్దు!

పెరుగుతున్న అత్యాచార కేసులు

బలైపోతున్న బాలికలు

అవగాహన లేక మోసపోతున్నారు

(రాజమహేంద్రవరం/ కాకినాడ-ఆంధ్రజ్యోతి)

చదువుకునేందుకు ఊరు కాని ఊరొచ్చింది.. ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూనే విద్యనభ్య సిస్తోంది.. సెల్‌ఫోన్‌లో పరిచయం ఒక యువకుడిని అన్నగా చెప్పుకునే వరకూ వెళ్లింది.. దీపావళి ముందు రోజు ఆ అన్నయ్య వచ్చాడు.. దీపావళి బాణసంచా కొని ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు. అన్నయ్య కదా అని నమ్మి వెళ్లింది. రెండు గంటల తరువాత ఒంటిపై గాయాలతో తిరిగొచ్చింది. అనుమానం వచ్చిన వార్డెన్‌ ఆరా తీస్తే.. జరిగింది చెప్పి గొల్లుమంది.. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ సంఘటన సెల్‌ఫోన్‌ పరిచయం ఎంత ప్రమాదకరమో చెబుతోంది.

ఆ బాలిక 7వ తరగతి చదువుతోంది.. తెలిసీ తెలియని వయసు.. అందునా అమ్మా నాన్న లేరు.. అమ్మమ్మ వద్ద ఉండి గురుకులంలో చదువుకుంటుంది.. అమ్మమ్మ ఊరికే చెందిన తాత వయసున్న వ్యక్తి ఆ బాలికను పరిచయం చేసుకున్నాడు.. బాలికకు ఎవరూ లేకపోవడంతో ఖాళీ ఉన్నప్పుడల్లా అతను వెళ్లేవాడు.. గురుకులంలో తాతగా చెప్పుకుని బయటకు రమ్మనేవాడు. బాలిక ఊరే కావడంతో అతనితో వెళ్లేది.. అలా నాలుగుసార్లు వెళ్లింది.. నాలుగోసారి అతనిలో వికృత రూపం బయటపడింది.. తెలిసినా బాలికలు ఒకరి వెంట వెళ్లడం ఎంత ప్రమాదకరమో తునిలో జరిగిన ఈ సంఘటన రుజువు చేస్తోంది.

స్వాతంత్రం.. స్వేచ్ఛ.. రెండిటికీ మధ్య యోజనాల వ్యత్యా సం ఉందని పెద్దలు చెప్పే మాట అక్షర సత్యమని ఛిద్రమ వుతున్న బాలికలు/అమ్మాయి ల జీవితాలు రుజువు చేస్తున్నాయి. రకరకాల కారణాలతో ప్రేమ.. ఆకర్షణ.. అవసరం.. వాంఛ.. వీటి మధ్య ఉన్న సున్నితమైన గీతను గుర్తించ డంలో విఫలమవుతున్నారు. తమంతట తాము గా వెళ్లి జీవితాలను, తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేసే వలకు చిక్కు తూ..చిక్కుముడుల సుడిగిండంలో ఇరుక్కుంటున్నారు. తీరా సున్నిత మైన గీత దాటామని గ్రహించే సరికి జీవి తాలు వేరొకరి వాంఛల గుప్పిట్లో బంధీలవుతున్నాయి. బంధువు లు సైతం కీచకులుగా మారుతున్నారు. ‘మంచి స్పర్శ - చెడు స్పర్శ’ అని ఎంత బోధిస్తున్నా ఫలితాలు పెద్దల రోదనలకు సమా ధానం చెప్పలేకపోతున్నాయి.

6 వేల మంది చిట్టిగర్భవతులు

బాలికలు కౌమార దశలో గర్భం దాల్చుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. 15 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లు 2023 నుంచి ఇప్పటి వరకూ 6 వేల మంది గర్భం దాల్చారనే గణాంకాలు సమాజాన్ని హెచ్చరిస్తున్నాయి. 2016 నుంచీ గత డిసెంబరు వరకూ మిస్సింగ్‌ కేసులు పరిశీలిస్తే.. ఉమ్మడి, విభజిత తూర్పుగోదావరిలో బాలలు 21, బాలికలు 70 మంది ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే పదుల సంఖ్యలో పోక్సో కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 12 ఏళ్లలోపు 45, 16 ఏళ్ల లోపు 35, 18 ఏళ్లలోపు బాలికలు 20 మంది తప్పిపోవడం లేదా ఇళ్ల నుంచి వెళ్లిపోవడం జరిగింది. గతేడాది 18ఏళ్ల పైబడిన వారిపై 23, 18 ఏళ్ల లోపు అంటే పిల్లలపై 43 అత్యాచార కేసులు నమోదయ్యాయి.ఈ 43 కేసుల్లో ఓ ఏడు తప్పా.. 36 ప్రేమ పేరుతో పరారైనవే కావడం గమనార్హం. ఇక ఆ 23 కేసుల్లో నాలుగు తప్పా మిగతా వాటిలో పెళ్లి చేసుకుంటామని చెప్పినవి ఉన్నాయి. ఈ ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇప్పటి వరకూ వందకుపైగా బాలి కలపై అత్యాచారం కేసుల సంఘటనలు ఉన్నాయి.

తల్లిదండ్రుల అప్రమత్తతే శ్రీరామరక్ష

తల్లిదండ్రుల అప్రమత్తత, ప్రవర్తనే పిల్లల పాలిట శ్రీరామరక్ష. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిఘా కచ్చితంగా ఉండాలి. తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవ రితో ఎక్కువగా మాట్లాడుతున్నారు? స్కూలు/కాలేజీకి వెళ్లేటప్పుడు విద్యార్థినులేం చేస్తున్నారు? దారి మధ్యలో పెత్తనాలు ఏవైనా చేస్తున్నారా ఇలాంటి విషయాలన్నీ గమనించాలి. హాస్టళ్ల లో ఉండే తమ ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. హాస్టళ్లలో పరిస్థితులు, తమ చిన్నారి ఎలా ఉంటోంది అనే విషయాలపైనా ఆరా తీయాలి. ముఖ్యంగా తమకు దూరంగా ఉండే పిల్లలతో ప్రేమగా మెలగాలి. వారి మనసులో బాధను తెలుసుకోవాలి. ఏం జరిగినా తమకు చెప్పాలనే భరోసా తల్లిదండ్రులు కల్పించాలి. తాము ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి. సాధారణంగా 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ ఉరకలు వేసే వయసు కావ డంతో దారితప్పే అవకాశం ఎక్కువ.అందువల్ల తల్లిదండ్రులు గమనిస్తుండాలి. పాఠశాలల్లో టీచర్ల వ్యవహారశైలి.విద్యార్థినులతో ప్రవర్తన గమనించాలి.

అధికారులేం చేస్తున్నారు..

ఇటీవల పోలీస్‌శాఖ, చైల్డ్‌ వెల్ఫేర్‌, ప్రొటెక్షన్‌ సెల్‌ ఆధ్వర్యంలో పాఠశాలలు,కళాశాలల్లో గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. పోక్సో చట్టం, ఈవ్‌టీజింగ్‌, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి విధించే శిక్షలు, అపరిచిత వ్యక్తులతో పాటు చుట్టుపక్కల సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాలపైనా న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే 100కు ఫోన్‌ చేసి తల్లిదండ్రులు సమాచారం ఇవ్వాలి.. జా ప్యం జరిగే పరిస్థితి విషమించే అవకాశం ఉంది.

బతుకులపై హల్‌సెల్‌!

ప్రస్తుతం సెల్‌ఫోన్‌ చాలా ప్రమాదకరంగా తయారైంది.. అది చేతిలో ఉంటే అన్నీ ఉన్నట్టే.. ఫ్రెండ్స్‌ కావాలంటే ఫ్రెండ్స్‌ని ఇస్తోంది.. ప్రేమికుడు కావాలన్నా.. ప్రేమికురాలు కావాలన్నా క్షణాల్లో ఇచ్చేస్తోంది.. అవి కాకుండా వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, షేర్‌చాట్‌ తదితర యాప్‌లు ఉన్నాయి.. ఈ సెల్‌ఫోన్‌కు యువత బానిసగా మారిపోతున్నారు.. గంటల తరబడి చాటింగ్‌లు.. గంటల తరబడి టాకింగ్‌లు.. గంటల తరబడి ఆటలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఎన్నెన్నో.. చదువును వదిలేసి మరి ఆ మాయలో మునిగితేలుతున్నారు.. తెలిసీతెలియని వయసులో యువతకు అదో ప్రేమమార్గంగా ఉంది.. అది కట్టడి చేయడానికి తల్లిదండ్రులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా అందులో చిక్కుకుపోయే యువతే ఎక్కువ.. సెల్‌ ఫోన్‌ ఎంత అవసరమో.. అంతే నాశనం కూడా చేస్తుందనేది జగమెరిగిన సత్యం.

జీవితంపై అలక్ష్యం!

ప్రస్తుతం ఒక లక్ష్యం పెట్టుకుని చదివే యువత చాలా తక్కువ శాతం కనిపిస్తున్నారు.. తల్లిదండ్రుల పోరు తప్ప.. ఏదో ఒకటి సాధిద్దాం అని చదువుకునే యువతరాన్ని వేళ్లపై లెక్కించవచ్చు.. తెలిసీతెలియని వయసులో ఆశలు.. కోరికలంటూ పరుగులు పెడుతున్నారు.. ఆశయాలను వదిలేస్తున్నారు.. బడి దగ్గర నుంచి కళాశాలల వరకూ ఎన్నెన్నో ప్రేమకథలు.. జీవితంలో ఏదో ఒకటి సాధించిన తరువాత ప్రేమించుకుంటే తప్పులేదు. కానీ ఏమీ లేకుండా ప్రేమ అంటున్నారు.. ఆ దోమ కుట్టడంతోనే అన్నీ గాలికే వదిలేస్తున్నారు.. ఆ ప్రేమ మోజులో పడి మోసపోయిన బాలికలు కోకొల్లలు.. మన జిల్లాలోనే చూస్తే ఏడో తరగతి చదివే బాలికలు గర్భవతులు.. ఇంజనీరింగ్‌ చదివే అమ్మాయి మోసపో తూనే ఉంటున్నారంటే పరిస్థితి ఎంత చేయి దాటుతుందో అర్థం చేసుకోవచ్చు.

కోరికల ఊబి..

కోరికలే గుర్రాలైతే.. అనే సామెత ఒకటుంది.. ఇది అమ్మాయికైనా.. అబ్బాయికైనా ఒక్కటే.. కోరికలు ఉండవచ్చు కానీ మితిమీరకూడదు.. ప్రస్తుతం కోరికలు మితిమీరిపోతున్నాయి. అవే యువతీ యువకులను.. బాలికలను పక్కదారి పట్టిస్తున్నాయి.. చాలా మంది బాలబాలికలు హీరోహీరోయిన్లను ప్రేమిస్తారు. వారిలా ఉండాలని తహతహలాడతారు.. అది చాలా ఖర్చుతో కూడుకున్నది.. ఆర్థిక అవసరాలకు చాలా మంది బాలికలు పక్కదారి పడుతున్నారు.. అదే వ్యసనంగా మార్చుకుంటున్నారు.. చదువుకున్నా ఏం చేసినా అదే ఆలోచన.. చదువును పక్కన పెట్టి ఎంతో మంది బాలికలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చదువుకునే వయసులో చదువుకుంటే భవిష్యత్‌ చాలా అందంగా ఉంటుంది. అది చాలా ఆలోచించకుండా కోరికలనే ఊబిలో చిక్కిపోతున్నారు.

పిల్లల ప్రవర్తన గమనిస్తుండాలి..

పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు గమనిస్తుండాలి.. సెల్‌ఫోన్‌ ఇస్తే నిఘా ఉండాలి. సోషల్‌ మీడియా ఎలా ఉపయోగిస్తున్నారనే విషయం పరిశీలించాలి. హెయిర్‌ కటింగ్‌, నడవడిక, దుస్తులు వంటివి మంచిగా ఉం డేట్లు చూసుకోవాలి. ఆడపిల్లలు ఒకవేళ ఎవరి ట్రాప్‌లో అయినా ఉండి మాట వినకపోతే వెంటనే పోలీసులకు చెప్పాలి. మేం కౌన్సె లింగ్‌ ఇస్తాం. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. స్కూలులో పిల్లలకు నైతిక విలువలు, మంచి నడవడిక గురించి నూరి పోస్తుండాలి.అందరం కలిసి ఆడపిల్లలను రక్షిద్దాం.- డి.నరసింహ కిశోర్‌, ఎస్పీ, తూర్పుగోదావరి

నైతిక విలువలు పెంచండి

తల్లిదండ్రులు పిల్లల ర్యాంకుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. నైతిక విలువలు చెప్పే వారు లేరు. ఆ తరగతి గదులూ మాయమయ్యాయి. ఇవన్నీ కలిసి పిల్లలు నడిచే తీరును వక్రమార్గంలోకి తీసుకెళు తున్నాయి. విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహభావంతో మెలగాలి. నీతి కథ లు, జీవితంపై చెడు చూపించే ప్రభా వం, కుటుంబ విలువలు నూరిపోయాలి. - డాక్టర్‌ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు

Updated Date - Nov 03 , 2025 | 12:29 AM