Share News

డబ్బు కోసమే బాలిక కిడ్నాప్‌

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:49 AM

అమలాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమ లాపురంలో ఇటీవల సంచలనం కలిగించిన బా లిక కిడ్నాప్‌ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు అమలాపురం సీఐ పి.వీరబాబు వెల్లడించారు. డబ్బుల కోసమే బాలికను కిడ్నాప్‌ చేశాడని, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్‌ విధించారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు సీఐ వీరబాబు బుధవారం విలేకర్లకు వివరించారు.

డబ్బు కోసమే బాలిక కిడ్నాప్‌
వివరాలు వెల్లడిస్తున్న అమలాపురం సీఐ

నిందితుడి అరెస్టు

14 రోజుల రిమాండ్‌

వెల్లడించిన అమలాపురం సీఐ వీరబాబు

అమలాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమ లాపురంలో ఇటీవల సంచలనం కలిగించిన బా లిక కిడ్నాప్‌ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు అమలాపురం సీఐ పి.వీరబాబు వెల్లడించారు. డబ్బుల కోసమే బాలికను కిడ్నాప్‌ చేశాడని, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్‌ విధించారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు సీఐ వీరబాబు బుధవారం విలేకర్లకు వివరించారు. ఈనెల 10న అమలాపురంలో స్కూలు నుంచి వస్తున్న కముజు నిషిత(10)ను వరుసకు మామయ్య అయిన మట్టపర్తి దుర్గానాగసత్యమూర్తి (చంటి) మోటారు సైకిల్‌పై వచ్చి కిడ్నాప్‌ చేసి కాకినాడ తీసుకెళ్లాడు. బాలికను క్షేమంగా అప్పగించాలంటే తాను పంపిస్తున్న యూపీఐ క్యూఆర్‌ కోడ్‌కు డబ్బులు పంపించాలని బాలిక తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. అయితే బాలిక తండ్రి కముజు వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమ లాపురం పట్టణ పోలీసులు డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌ పర్యవేక్షణలో విచారణ కోసం బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్‌ఐలు టి.శ్రీనివాస్‌, జోషి మూడు బృందాలుగా ఏర్పడి కాకినాడ, పి.గన్నవరం, ముంగండ, పోతవరం, కారుపల్లి గ్రామాల్లో ముమ్మరంగా గాలించారు. కిడ్నాప్‌ అయిన 11 గంటలోనే బాలిక ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మట్టపర్తి దుర్గానాగసత్యమూర్తి అలియాస్‌ చంటిని పోతవరం గ్రామంలో బుధవారం సీఐ వీరబాబు పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీనివాస్‌, సిబ్బంది అరెస్టు చేశారు. అతడి నుంచి నేరానికి ఉపయోగించిన మోటారు సైకిల్‌, 2 సెల్‌ఫోన్లు, బాలిక స్కూలు బ్యాగు, లంచ్‌బాక్సు, జత స్కూలు షూలు స్వాధీన పరచుకున్నారు. అతడిని అమలాపురంలో అడిషనల్‌ జ్యూడిషీయల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారని సీఐ తెలిపారు. నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన ఎస్‌ఐలు, సిబ్బందిని సీఐ వీరబాబు అభినందించారు.

Updated Date - Nov 20 , 2025 | 12:49 AM