Share News

అమలాపురంలో బాలిక కిడ్నాప్‌

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:11 AM

అమలాపురం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అమలాపురంలో ఐమెండ్‌ స్కూ ల్‌లో ఐదోతరగతి చదువుతున్న పదేళ్ల బాలిక సోమవారం సాయంత్రం కిడ్నా ప్‌కు గురైన విషయం సంచలనంగా మా రింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని మెయిన్‌రో

అమలాపురంలో బాలిక కిడ్నాప్‌

కాకినాడ తీసుకెళ్లినట్టు గుర్తింపు

అమలాపురం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అమలాపురంలో ఐమెండ్‌ స్కూ ల్‌లో ఐదోతరగతి చదువుతున్న పదేళ్ల బాలిక సోమవారం సాయంత్రం కిడ్నా ప్‌కు గురైన విషయం సంచలనంగా మా రింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూలులో వైసీపీ నాయకుడు కముజు రమణ కుమార్తె నిషిత (10) కిడ్నాప్‌ అయినట్టు పట్టణ పోలీసులకు సమాచారం అందింది. బాలికకు వరుసకు మేనమామ అయ్యే మట్టపర్తి మధు అనే వ్యక్తి సోమవారం సాయంత్రం స్కూలు వద్దకు వచ్చి బాలి కను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి మోటారుసైకిల్‌ ఎక్కించుకుని వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. తన కుమార్తె ఇంకా ఇంటికి చేరలేదని విచారించగా మట్టపర్తి మధు స్కూలుకు వెళ్లి తీసుకెళ్లినట్టు తెలిసిందని కముజు రమణ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వీరబాబు అప్రమత్తమై విచారణ చేపట్టారు. కముజు రమణకు ఇద్దరు కుమార్తెల్లో చి న్న కుమార్తె నిషితను సమీప బంధు వుగా పేర్కొంటున్న మట్టపర్తి మధు మో టార్‌సైకిల్‌ ఎక్కించుకుని కాకినాడ వెళ్లిన ట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తిం చారు. కాకినాడలోని మొబైల్‌ షాపులో కొత్త ఫోన్‌, సిమ్‌ కొనుగోలు చేస్తున్న సమయంలో బాలిక ఎడవడంతో మధు ఫోన్‌తో పాటు సిమ్‌కార్డును వదిలి బాలి కను తీసుకుని పరారైనట్టు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందింది. దీంతో కాకినాడ, అమలాపురం నుంచి పోలీసు బృందాలు బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.

Updated Date - Nov 11 , 2025 | 01:11 AM