క్షేమంగా దొరికింది!
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:30 AM
అమలాపురం/పి.గన్నవరం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో కిడ్నాప్ అయిన పదేళ్ల బాలికను పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వద్ద కొందరు మాలధారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలికను త ల్లికి క్షేమంగా అప్పగించడంతో కథ సుఖాంతమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్న వైసీపీ నాయకుడు కముజు రమణ కుమార్తె నిషిత (10) ఇంటికి సమీపంలోనే ఉన్న ఓ ప్రైవేటు స్కూలులో 5వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం
బాలికను కాపాడిన మాలధారులు
అమలాపురంలో కిడ్నాప్ అయిన బాలిక
పి.గన్నవరం మండలం యర్రంశెట్టి వారిపాలెం వద్ద ఆచూకీ గుర్తింపు
తల్లికి అప్పగించిన పోలీసులు
పరారీలో కిడ్నాపర్
అమలాపురం/పి.గన్నవరం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో కిడ్నాప్ అయిన పదేళ్ల బాలికను పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వద్ద కొందరు మాలధారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలికను త ల్లికి క్షేమంగా అప్పగించడంతో కథ సుఖాంతమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్న వైసీపీ నాయకుడు కముజు రమణ కుమార్తె నిషిత (10) ఇంటికి సమీపంలోనే ఉన్న ఓ ప్రైవేటు స్కూలులో 5వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి రమణ సమీప బంధువైన పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన మట్టపర్తి మీరా సత్యమూర్తి (చంటి) బాలికకు మాయమాటలు చెప్పి మోటారుసైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. పాప ఇంటికి రాకపోవడంతో స్కూలు యాజమాన్యాన్ని ఆరా తీసిన కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యమూర్తి బాలికను కాకినాడ తీసుకెళ్లి సెల్‌ఫోన్, సిమ్‌కార్డు కొనుగోలు చేసే క్రమంలో బాలిక ఏడవడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కాకినాడ, అమలాపురం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కిడ్నాపర్ కాకినాడ నుంచి మండపేట, రావులపాలెం మీదుగా పి.గన్నవరం మండలంలోని ఆర్.ఏనుగుపల్లి శివారు కారుపల్లికి చేరుకున్నాడు. అక్కడ రాత్రి ఓ కొబ్బరితోటలో బాలికతో దాక్కున్నాడు. స్కూలు బ్యాగులు, షూలు వదిలి కాలినడకన ఆర్.ఏనుగుపల్లి నుంచి వేకువజామునే బయలుదేరి పి.గన్నవరం జంక్షన్ మీదుగా బెల్లంపూడి దగ్గరలోని యర్రంశెట్టివారిపాలెనికి బాలికను తీసుకెళ్లాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ముంగండకు చెందిన కొందరు మాలధారులు సోషల్ మీడియా ద్వారా బాలిక కిడ్నాప్ విషయం తెలియడంతో ఆ బాలికను గుర్తుపట్టి సత్యమూర్తిని ప్రశ్నించడంతో బాలికను వదిలేసి పరారయ్యాడు. అప్పటికే పోలీసులకు సమాచా రం అందడంతో బాలికను తల్లికి అప్పగించారు. బాలిక ఆచూకీ కోసం కృషి చేసిన డీఎస్పీ ప్రసాద్, అమలాపురం సీఐ వీరబాబు, సిబ్బ ందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. బాలిక సత్యమూర్తికి వరుసకు మేనకోడలు అవుతుందని సమాచారం. నిందితుడిని పట్టు కునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.