గోగులమ్మ అమ్మవారికి చీర, సారె సమర్పణ
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:13 AM
వెలంపాలెంలోనున్న గోగులమ్మ అమ్మవారికి మంగళవారం పట్టువస్త్రాలు, చీర సమర్పించారు.

ద్రాక్షారామ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): వెలంపాలెంలోనున్న గోగులమ్మ అమ్మవారికి మంగళవారం పట్టువస్త్రాలు, చీర సమర్పించారు. భీమేశ్వరుని ఆడపడుచుగా గోగులమ్మ అమ్మవారికి జాతర సందర్భంగా పట్టువస్త్రాలు, సారె సమర్పిస్తున్నారు. గోగులమ్మ జాతరను పురస్కరించుకుని మంగళవారం భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్ల తో ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గాభవానీ, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, సర్పంచ్ కొత్తపల్లి అరుణ, వెలంపాలెం సర్పంచ్ టేకుమూడి సుజాత తదితరులు మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా గోగులమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లు, పుష్పాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.