Share News

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ గా సత్యనారాయణ

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:24 AM

రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌గా జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ పీవీవీ.సత్యనారాయణను నియమిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ గా సత్యనారాయణ
సూపరింటెండెంట్‌ గా సత్యనారాయణ

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌గా జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ పీవీవీ.సత్యనారాయణను నియమిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి అడిషనల్‌ ఛార్జ్‌ (ఎఫ్‌ఏసీ) హోదాలో ఆయన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించనున్నారు. రాజమహేంద్రవరం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతూ, జీజీహెచ్‌కు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జీజీహెచ్‌కు ఎవరినీ సూపరింటెండెంట్‌గా నియమించలేదు. అత్యవసర సేవల్లో అత్యంత ప్రధానమైన, వైద్యపరమైన పాలనా విధులను పర్యవేక్షించాల్సిన ఈ కీలకమైన పోస్టు విషయంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించారు. చివరకు నాలుగు రోజుల సస్పెన్స్‌కు తెరదించుతూ డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణను సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Updated Date - Nov 04 , 2025 | 12:25 AM