Share News

ఏటీఎస్‌ను ఉపసంహరించాలి

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:43 AM

రవాణా వ్యవస్థ మనుగడకు ముప్పుగా పరిణమించిన ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సిస్టం(ఏటీఎస్‌)ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని ఏపీ ట్యాక్సీ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఏటీఎస్‌ను ఉపసంహరించాలి
జిల్లా రవాణా అధికారి కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేస్తున్న కార్మికులు

  • రవాణా రంగ కార్మికులు

  • రాజమహేంద్రవరంలోని డీటీవో కార్యాలయం, రాజానగరంలోని ఏటీఎస్‌ కేంద్రం వద్ద నిరసనలు

  • డీటీవో కార్యాలయం ఎదుట నిరసన

రాజమహేంద్రవరం అర్బన్‌/రాజానగరం, జులై 1 (ఆంధ్రజ్యోతి): రవాణా వ్యవస్థ మనుగడకు ముప్పుగా పరిణమించిన ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సిస్టం(ఏటీఎస్‌)ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని ఏపీ ట్యాక్సీ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం రాజమహేంద్రవరంలోని జిల్లా రవాణా అధికారి కార్యాలయం ఎదుట, రాజానగరంలోని ఏటీఎస్‌ కేంద్రం వద్ద రవాణా రంగ కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ సాంకేతిక వాహనాల సామర్థ్యాన్ని అంచనా వేయగల ప్రక్రియను నిర్వహించడానికి ఏటీఎస్‌ విధానం ఉపకరించకపోగా, వాహనం ఇంజన్‌ తదితర ముఖ్య భాగాలకు హాని జరుగుతుందన్నారు. ఏటీఎస్‌ ప్రక్రియ విఫలమైందన్న వాస్తవాన్ని ఇప్పటికే పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందనలేకపోవడంతో నిరసన చేపట్టినట్టు తెలిపారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్టీవో కార్యాలయంలో ఏవో సత్తిబాబుకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముచ్చకర్ల సత్యనారాయణ, మార్గాన వసంతకుమార్‌, దేముడు, వెన్న సత్యనారాయణ, కుమార్‌, నిడదవోలు, కొవ్వూరు, మండపేట, అనపర్తి ట్యాక్సీ స్టాండ్‌ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.

టీఎన్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధ రరావు, బాక్స్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. రాజమహేంద్రవరం నుంచి ఆటోలు, లారీలు, గూడ్స్‌ వాహనాలతో ర్యాలీగా రాజానగరంలోని ఏటీఎస్‌ కేంద్రానికి చేరుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎం పీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఫిట్‌నెస్‌ సెంటర్ల విధా నం లేదని, తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహ రించుకుని, పాత విధానానే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షు డు వాసంశెట్టి గంగాధర్‌ మాట్లాడుతూ రవాణా కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరు కోబోమన్నారు. బాక్స్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ర వాణా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) నాయ కులు పోలుపల్లి నాగేశ్వరరావు, సప్పా ఆదినారా యణ, కాకినాడ కృష్ణ, జి.నరసింహారావుతోపాటు లారీ యూనియన్‌ నాయకులు గోపాల్‌, రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:43 AM