పేలిన గ్యాస్ సిలెండర్
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:42 AM
ద్రాక్షారామ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో మంగళవారం రాత్రి అనిశెట్టి సుబ్బలక్ష్మీ ఇంటి స్టోర్‌రూమ్‌లో గ్యాస్ సిలెండర్ పేలింది. ఫైర్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామం లో అనిశెట్టి సుబ్బలక్ష్మీ చెందిన ఇంటి వంట గదికి చే
భీమక్రోసుపాలెంలో వ్యక్తి పరిస్థితి విషమం
ద్రాక్షారామ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో మంగళవారం రాత్రి అనిశెట్టి సుబ్బలక్ష్మీ ఇంటి స్టోర్‌రూమ్‌లో గ్యాస్ సిలెండర్ పేలింది. ఫైర్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామం లో అనిశెట్టి సుబ్బలక్ష్మీ చెందిన ఇంటి వంట గదికి చేర్చి మేడమెట్ల కింద స్టోర్‌రూమ్‌లో వి ద్యుత్‌మీటరు, కట్టెల పొయ్యి ఉంది. గదిలో కట్టె లు, పూర్తి గ్యాస్ నిండి ఉన్న అదనపు సిలెండర్ ఉన్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో స్టోర్‌రూమ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలో ఉన్నవారు కేకలు వేయడంతో ఇంట్లో నుంచి సుబ్బలక్ష్మీ, కుటుంబీకులు బయటకు వచ్చేశారు. మంటల్లో గ్యాస్ సిలెండర్ ఉండటంతో ఒక్కసారిగా పేలిపోయింది. వారికి సా యం చేసేందుకు వెళ్లిన పితాని చినబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అగ్నిమాపకదళ అదికారి కె.వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చినబాబును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నా రు. పేలుడు ధాటికి ఇంటి వంటగది గోడలు ధ్వంసమై మేడమెట్లు కూలిపోయాయి. రూ.2 లక్షల నష్టం సంభవించినట్టు చెప్తున్నారు.