సత్యదేవుడి సన్నిధిలో గరికపాటి పూజలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:13 AM
అన్నవరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త
అన్నవరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు కుటుంబసభ్యులతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. బంధువుల వివాహానికి హాజరైన వారు కొండదిగువన వివాహం అనంతరం స్వామివారి సన్నిధికి విచ్చేశారు.