Share News

జీవీపీని వంద శాతం తొలగించాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:36 AM

బహిరంగ ప్రదేశాలు, రోడ్ల వెంట వ్యర్ధ పదార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ రాహుల్‌మీ నా ఆదేశించారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రస్తుతం ఉన్న గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్లను(జీవీపీ) తక్షణమే తొ లగించాలని, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

జీవీపీని వంద శాతం తొలగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌

  • పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో సమీక్షలో కమిషనర్‌ రాహుల్‌మీనా

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు11( ఆంధ్రజ్యోతి): బహిరంగ ప్రదేశాలు, రోడ్ల వెంట వ్యర్ధ పదార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ రాహుల్‌మీ నా ఆదేశించారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రస్తుతం ఉన్న గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్లను(జీవీపీ) తక్షణమే తొ లగించాలని, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇం టింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిచండంతో పాటు వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని చెప్పారు. రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని,ఊడ్చిన చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలని, ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు ఎంత మంది విధులకు వస్తున్నదీ రికార్డులు ఉండాలన్నారు. ఉదయం 6:30 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో డోర్‌ టూ డోర్‌ చెత్తసేకరణ మొదలు కావాలని ఆదేశించారు. వీఽధి వ్యాపారులు, హోటళ్లు, టీ పాయింట్లు, జ్యూస్‌ స్టాల్స్‌ యజమానులు తప్పనిసరిగా చెత్త డబ్బా లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. హస్టళ్ల పరిసరాల్లో మెరుగైన పారిశుధ్యా న్ని నిర్వహించాలన్నారు. అనంతరం చెత్త సేకరణ వాహనాల కండిషన్‌ను అడిగి తెలుసుకున్నారు. మరమ్మత్తులుంటే తక్షణమే చేయించాల ని ఆదేశించారు. వీధి కుక్కల విషయంలో సు ప్రీంకోర్టు గైడ్‌ లైన్‌ ను తప్పనిసరిగా పాటించాలన్నారు. రిపబ్లిక్‌ గ్రీవెన్స్‌ను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయడంతో పాటు రీఓపెన్‌ కాకుండా చూడాలన్నారు.సమావేశంలో ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న, శానిటరీ సూపర్‌వైజర్‌లు, ఇన్‌స్పెక్టర్లు, బయాలజిస్ట్‌లు, సచివాయల శానిటరీ సెక్రటరీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:36 AM