ఒడిశా టూ కోయంబత్తూరు...
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:24 AM
కొవ్వూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఒడిశా ప్రాంతం నుంచి కోయంబత్తూరుకు తర లిస్తున్న 172 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సీహెచ్.లావణ్య తెలిపారు. కొవ్వూ రు గామన్ వంతెన దిగువన దొమ్మేరు
గంజాయి తరలిస్తుండగా పట్టివేత
రూ. 8 లక్షల విలువైన సరుకు స్వాధీనం
ఆటో, లారీ సీజ్... ముగ్గురిపై కేసు
కొవ్వూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఒడిశా ప్రాంతం నుంచి కోయంబత్తూరుకు తర లిస్తున్న 172 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సీహెచ్.లావణ్య తెలిపారు. కొవ్వూ రు గామన్ వంతెన దిగువన దొమ్మేరు రోడ్డులో ఆటో నుంచి లారీలోకి గంజాయి ఎక్కి స్తున్నారని కొవ్వూరు ఎక్సైజ్ సీఐ జి.సత్యనారాయణకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి తీసుకువచ్చిన ఆటో, రవాణా చేస్తున్న లారీలను సీజ్ చేసి 86 ప్యాకెట్లలో ఉన్న 172 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి డొం కరాయికి చెందిన ఆటోలో డ్రైవర్ గంజాయిని కొవ్వూరు తీసుకువచ్చాడు. ఇక్కడి నుంచి కొయంబత్తూరుకు తరలించేందుకు లారీలో ఎక్కిస్తుండగా డొంకరాయికి చెందిన ఆటో డ్రైవర్, తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్‌లను అరెస్టు చేశామని ప్రొహిబిషన్ అ ండ్ ఎక్సైజ్ అధికారి లావణ్య తెలిపారు. తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్‌ఐలు డి.అప్పారావు, రవిశంకర్, ఐఎన్‌ఎస్.బాలాజీ, సిబ్బంది ఉన్నారు.