Share News

ఏజెన్సీ టు పెద్దాపురం..

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:24 AM

కిర్లంపూడి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో పోలీసులు గురువారం 24.69 కి లోల గంజాయిని పట్టుకుని ఏడుగురిని అరె స్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. కిర్లంపూడి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈగల్‌ టీమ్‌ సహకారంతో రాజ

ఏజెన్సీ టు పెద్దాపురం..
గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకున్న పోలీసులు

గంజాయి తరలిస్తున్న ఏడుగురి అరెస్ట్‌

24.690 కిలోల గంజాయి, మూడు ద్విచక్రవాహనాలు, నాలుగు ఫోన్లు స్వాధీనం

కిర్లంపూడి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో పోలీసులు గురువారం 24.69 కి లోల గంజాయిని పట్టుకుని ఏడుగురిని అరె స్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. కిర్లంపూడి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈగల్‌ టీమ్‌ సహకారంతో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్లే దారిలో బూరుగుపూడి శివారు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నకుల్‌సింగ్‌, జంపా దుర్గాప్రసాద్‌, పంచదార స్వామి, వనపర్తి రాజేష్‌, సప్ప అశోక్‌, లంక శ్రీకల్యాణ్‌రామ్‌, గొంపు అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి పెద్దాపురం గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. వారి ను ంచి 12 ప్యాకెట్లలోని 24.690 కిలోల గంజాయి, 3 ద్విచక్రవాహనాలు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చే సుకున్నారు. సీజ్‌ చేసిన వస్తువుల విలువ రూ. 13,29,500 ఉంటుందని, దీనిపై కేసు నమోదు చేశామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. జగ్గంపేట సీఐ వై.శ్రీనివాస్‌, కిర్లంపూడి ఎస్‌ఐ జి.సతీష్‌, ఐడబ్ల్యు కృపా, వీరబాబు, ఈగ ల్‌టీమ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - Dec 12 , 2025 | 12:24 AM