గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:34 AM
రాజోలు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): గంజాయిని విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి రూ.12వేలు విలువ చేసే 3 కిలోల గంజాయిని సీజ్ చేశామని రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్ తెలిపారు. రాజోలు సర్కిల్ పోలీస్‌స్టేషన్ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో ఆయన మాట్లా డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
3 కిలోల సీజ్
రాజోలు సీఐ నరేష్‌కుమార్
రాజోలు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): గంజాయిని విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి రూ.12వేలు విలువ చేసే 3 కిలోల గంజాయిని సీజ్ చేశామని రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్ తెలిపారు. రాజోలు సర్కిల్ పోలీస్‌స్టేషన్ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో ఆయన మాట్లా డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడానికి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఉత్తర్వుల ప్రకారం కొత్తపేట డీఎస్పీ ఎస్.మురళీమోహన్ పర్యవేక్షణలో రాజోలు సీఐ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో పాత గంజాయి నేరస్తులపై నిఘా పెట్టడంతో రీవిజన్ ప్రోగ్రాంలో భాగంగా పాత నిందితులను పోలీసు స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ చేసిన తరుణంలో ఈ నెల 16న గంజాయి రవాణాపై మలికిపురం ఎస్‌ఐ పి.సురేష్‌కి సమాచారం అందింది. మలికిపురం మండలం శంకరగుప్తంలో చవ్వాకుల నితీష్ స్వగృహంలో గంజాయిని కలిగి ఉండి వ్యాపారం చేస్తున్న వారి నుంచి మలికిపురం మండలం డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వోల సమక్షంలో ఎస్‌ఐ సురేష్ 3కిలోల గంజాయిని సీజ్ చేసి ఆరుగు రిని అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌కు చెందిన ఎ.ప్రశాంత్‌కుమార్, మలికిపురం మండలం శంకరగుప్తానికి చెందిన చవ్వాకుల నితీష్, పడమటిపాలెంకు చెందిన తాడి హరీష్‌బాబు, బట్టేలంకకు చెందిన కె.మనోజ్, చింతలమోరికి చెందిన బి.దిశాన్‌కుమార్, కేశనపల్లికి చెందిన జి.శ్యామ్సన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుల తల్లిదండ్రులు కుటుంబపోషణ నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉండడం వల్ల వారి పర్యవేక్షణ లేకపోవడం వల్ల గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసలయ్యారని తెలిపారు. గంజాయి రవాణాపై సమాచారం ఉన్న పోలీసులకు లీగల్ టోల్‌ఫ్రీ 1972లో సమాచారం అందజేయాలని సీఐ కోరారు.