Share News

దురలవాట్లకు లోనై...

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:57 AM

సర్పవరం జంక్షన్‌, నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ రమ ణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో ఖాళీ భవనం వద్ద పోలీసులు ఆకస్మిక దాడి చేసి 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురు నింది తులను అరెస్ట్‌ చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండ

దురలవాట్లకు లోనై...
నిందితులను అరెస్ట్‌ చేసిన సర్పవరం పోలీసులు

గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్‌

24 కిలోల గంజాయి స్వాధీనం

సర్పవరం జంక్షన్‌, నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ రమ ణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో ఖాళీ భవనం వద్ద పోలీసులు ఆకస్మిక దాడి చేసి 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురు నింది తులను అరెస్ట్‌ చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సర్పవరం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో బి.పెద్దిరాజు తెలిపారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు ఎస్‌ డీపీవో పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌, సీఐ పెద్దిరాజు పర్యవేక్షణలో ఎస్‌ఐ పి.శ్రీని వాస్‌కుమార్‌ సిబ్బందితో కలసి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు డిప్యూ టీ తహశీల్దార్‌ సమక్షంలో ఏపీఐఐసీ ఖాళీ భవనంపై దాడులు నిర్వహిం చారు. అక్కడ కాకినాడ రూరల్‌ మం డలం రమణ య్యపేట ఐశ్వర్యాంబిక ఆలయం సమీపానికి చెందిన 20 ఏళ్ల బులిపే అజయ్‌కుమార్‌ (అజయ్‌), ఇంద్రపాలెనికి చెం దిన 19 ఏళ్ల అనపర్తి శివశంకర్‌ (గోంగలి), సీసీఎల్‌-1 17ఏళ్ల పెంకే వెంకట సత్యవరప్రసాద్‌ (ప్రసాద్‌), 17 ఏళ్ల కోరిమిల్లి సురేష్‌ను అదుపు లోకి తీసుకున్నారు. నలుగురి వద్ద తలో 6 కిలో లు వెరసి 24 కిలోలు (రూ.1.20 లక్షలు) విలు వైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌హెచ్‌వో పెద్దిరాజు తెపారు. వీరంతా స్నేహి తులని.. గంజాయి, సిగరెట్‌, మద్యం వంటి దుర లవాట్లకు లోనై సులువుగా డబ్బు సంపాదిం చాలనే ఉద్దేశంతో గంజాయి రవాణా బాట పట్టారన్నారు. వీరు నర్సీపట్నం సమీపంలో గల ఏజెన్సీ ప్రాంతం నుంచి కిలో గంజాయి రూ.2 వేలుకు కొనుగోలు చేసి కాకినాడకు తీసుకువచ్చి విక్రయించి లాభాలు పొందాలనుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఏ1,ఏ2 ఇద్దరిపై పూర్వ నేరచరిత్ర ఉందని, అజయ్‌ కుమార్‌ సామర్లకోట పీఎస్‌లో నిందితుడని, శివశంకర్‌ పలు కేసుల్లో నిందితుడన్నారు. మిగతా ఇద్దరు మైనర్లను రాజమహేంద్రవరం జువైనైల్‌ జస్టిస్‌ బోర్డుకు తరలించడం జరిగిందన్నారు. ఏ1, ఏ2 నిందితు లను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించామ న్నారు. ఎక్కడైనా డ్రగ్స్‌ వాడకం, గంజాయి రవాణా, మత్తు పదార్థాల వ్యాపారం జరిగితే 112, 100కు సమాచారం అందించాలని కోరారు.

Updated Date - Nov 02 , 2025 | 12:57 AM