గంజాయితో నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:46 AM
మండపేట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని మారేడుబాక పంచాయతీ పరిధిలోగల
మండపేట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని మారేడుబాక పంచాయతీ పరిధిలోగల సాయినగర్‌లో గంజా యితో నలుగురిని పట్టుకున్నామని పట్టణ ఎస్‌ఐ రాము తెలిపారు. గురువారం రాత్రి సాయినగర్ లో యవత గంజాయి సేవిస్తున్నారని సమా చారం రావడంతో దాడి చేశామన్నారు. మారేడు బాకకు చెందిన ఇద్దరు యువకులు, అనపర్తికి చెందిన యువకుడు, మండపేట పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలికను ఆదుపులోకి తీసుకుని వారి నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ఆలమూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌విధించారని ఎస్‌ఐ తెలిపారు.