Share News

కారులో దర్జాగా గంజాయి రవాణా

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:22 AM

కాకినాడ క్రైం, సెస్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇన్నోవా కారుకు ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అని స్టిక్కర్‌ వేసుకుని దర్జాగా అధికారుల వలే తిరుగుతూ గంజాయి రవాణా సాగిస్తూ అనుమానంతో కారు ఆపిన వారిని ఢీకొని అడ్డు అదుపులేని వేగ ంతో వెళ్తూ చివరికి కాకినాడ జిల్లా పోలీసులకు చిక్కారు. ఈ కేసు

కారులో దర్జాగా గంజాయి రవాణా
స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న ఎస్పీ

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

383.820 కిలోల గంజాయి, ఇన్నోవా క్రిష్టా కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌

కాకినాడ క్రైం, సెస్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇన్నోవా కారుకు ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అని స్టిక్కర్‌ వేసుకుని దర్జాగా అధికారుల వలే తిరుగుతూ గంజాయి రవాణా సాగిస్తూ అనుమానంతో కారు ఆపిన వారిని ఢీకొని అడ్డు అదుపులేని వేగ ంతో వెళ్తూ చివరికి కాకినాడ జిల్లా పోలీసులకు చిక్కారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి 383.820 కిలోల గంజాయి, ఇన్నోవా క్రిష్టా కారును స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం విలేకర్లకు ఎస్పీ జిబిందుమాధవ్‌ నిందితుల వివరాలు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

ఈ నెల 23న ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అనే బోర్డు ఉన్న ఇన్నోవా క్రిష్టా తెలుపు రంగు కారులో ఇద్దరు పురుషులు, ఒక మహిళా ప్రయాణం చేశారు. విశాఖపట్నం, భీమునిపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జొన్నాడ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు, సిబ్బంది అనుమానంతో కారును ఆపగా డ్రైవరు కారును వేగంగా నడిపి టోల్‌ప్లాజా సిబ్బందిని బలంగా ఢీకొని గాయపర్చి కాకినాడ వైపు వెళ్లిపోగా కాకినాడ జిల్లా పోలీసులకు అక్కడ సిబ్బంది సమాచారం అందించారు. అనంతరం ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్‌డీపీవో శ్రీహరిరాజు ఆధ్వర్యంలో జగ్గంపేట సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌, కిర్లంపూడి ఎస్‌ఐ టి.రఘునంధన్‌రావు సిబ్బందితో కలిసి కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేశారు. టోల్‌ప్లాజా వద్ద కారును ఆపే క్రమంలో ఇన్నోవా డ్రైవర్‌ వెనుకకు తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న లారీని ఢీకొని పారిపోతుండగా కారు అద్దాలు పగిలి డ్రైవర్‌ను కారు నుంచి కిందకి దింపేందుకు ప్రయత్నం చేయగా డ్రైవర్‌ ఫోన్‌ కిందపడిపోయింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డ్రైవరు తీవ్రంగా ప్రతిఘటించి కారు నుంచి దిగకుండా ప్రత్తిపాడు వైపు కారును వేగంగా పోనిచ్చాడు. అయితే కిర్లంపూడి గ్రామంలో పైడితల్లి అమ్మ గుడి పక్కన ఉన్న రోడ్డుపై కారు నుంచి 2 గంజాయి ప్యాకెట్లు పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. అనంతరం ఈగల్‌ టీమ్‌ సహకారంతో ఐటికోర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నెల 25న ఆ కారును ట్రాక్‌ చేస్తూ వెళ్తు ండగా పెద్దాపురం మండలం ఆర్‌బి కొత్తూరు నుంచి చినబ్రహ్మదేవం గ్రామం వెళ్లే రోడ్డులోని పోలిమేర పుంత దారి పొలాల్లో కిట్‌కిట్‌ ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించి 165 గంజా యి ప్యాకెట్లను పోలీసులు సీజ్‌ చేశారు. దీనిపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే జొన్నాడ టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఘటనపై భీమునిపట్నం పోలీస్‌స్టేషన్‌లో గంజా యి రవాణా కేసుతో పాటు క్రిమినల్‌ కేసు కూడా నమోదైనట్టు ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. నిందితులు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన వారని, విశాఖ ఏజన్సీ ప్రాంతమైన జి.మాడుగులకు వ్యాపారం నిమిత్తం వలస వచ్చినట్టు ఎస్పీ తెలిపారు. వారు అక్కడే ఉంటూ విశాఖ ఏజన్సీ, ఒడి స్సా నుంచి గంజాయిని సేకరించి రాజస్థాన్‌కు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో కాదంసింగ్‌ (22) అలియాస్‌ కుందన్‌సింగ్‌, కన్కర్‌ దేవి (55), మాపికన్వర్‌ (23) అలియాస్‌ లాక్‌సువాన్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. వారి నుంచి రూ. 19,19,100 విలువైన 383.820 కిలోల బరువున్న 175 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇన్నోవా క్రిష్టా కారు, 2 సెల్‌ఫోన్లను సీజ్‌ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. వీటి మొత్తం విలువ రూ.29,23,100 ఉంటుందని తెలిపారు. పరారైన మరో నలుగురి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ బిందుమాధవ్‌ వెల్లడించారు. సమావేశంలో కాకినాడ ఎస్‌డీపీవో పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌, ఎస్‌బీ డీఎస్పీ కెవి సత్యనారాయణ, పెద్దాపురం ఎస్‌డీ పీవో శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 12:22 AM