408 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:25 AM
కోరుకొండ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద పోలీసులు 10 బస్తాల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ వై.సత్యకిషోర్ మంగళవారం సాయంత్రం కోరుకొండ పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాకు వెల్లడించారు.
ఇద్దరి అరెస్ట్
కోరుకొండ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద పోలీసులు 10 బస్తాల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ వై.సత్యకిషోర్ మంగళవారం సాయంత్రం కోరుకొండ పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాకు వెల్లడించారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు బూరుగుపూడి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కత్తిపూడి నుంచి ఒక వ్యానులో చెన్నైకి తరలిస్తున్న 408 కిలోల బరువున్న 10 బస్తాల గంజాయిని ఎస్‌ఐ నాగార్జున, సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. దాని విలువ రూ.22 లక్షలు. ఈ గంజాయిని కత్తిపూడి వద్ద బ్రిడ్జి దాటిన తరువాత వ్యాన్‌లో ఎక్కించి తరలిస్తున్నారని, అయితే రాజానగరం వద్ద పోలీస్ తనిఖీలు జరుగుతున్నాయన్న సమాచారంతో వ్యాన్ ను దోసకాయలపల్లి, బూరుగుపూడి మీదుగా రూటు మళ్లించారని, బూరుగుపూడి గేటు వద్ద వాహనాన్ని ఆపకుండా పరారవుతున్న నేపథ్యంలో పోలీసులు చాకచక్యంగా వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయడంతో గంజాయి దొరికింది. దీంతో తమిళనాడుకు చెందిన ఆనింది సెల్వా వేల్ము మురగన్ (30), నాగేంద్రన్(38)పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. వీరి ద్వారా కత్తిపూడి పరిసరాల్లో కుమార్ అనే వ్యక్తి గంజాయిని చెన్నైకి పంపిస్తున్నాడని చెప్పారు.