Share News

గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:23 AM

కాకినాడ క్రైం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చే స్తున్న ఇద్దరు నిందితులను కాకినాడ జిల్లా పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.16,71,400 విలువైన 213.28 కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. లేలాండ్‌ గూడ్స్‌ వాహనం, స్మార్ట్‌ ఫోన్‌ను సీజ్‌ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్‌హెచ్‌- 16 హైవేపై గంజాయి రవాణా జరుగుతుందని ఎస్పీకి వచ్చిన పక్కా సమాచారంతో ఆయన ఆదేశాల మెరకు పెద్దాపురం ఎస్‌ డీపీవో శ్రీహరిరాజు పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ వైఆ ర్‌కె శ్రీనివాస్‌ తన బృం

గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా
పట్టుకున్న గంజాయితో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌, పోలీసు అధికారులు

పట్టుకున్న కాకినాడ జిల్లా పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

213.28 కిలోల గంజాయి స్వాధీనం

కాకినాడ క్రైం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చే స్తున్న ఇద్దరు నిందితులను కాకినాడ జిల్లా పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.16,71,400 విలువైన 213.28 కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. లేలాండ్‌ గూడ్స్‌ వాహనం, స్మార్ట్‌ ఫోన్‌ను సీజ్‌ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్‌హెచ్‌- 16 హైవేపై గంజాయి రవాణా జరుగుతుందని ఎస్పీకి వచ్చిన పక్కా సమాచారంతో ఆయన ఆదేశాల మెరకు పెద్దాపురం ఎస్‌ డీపీవో శ్రీహరిరాజు పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ వైఆ ర్‌కె శ్రీనివాస్‌ తన బృందంతో రామవరం, రంగవల్లి నగర్‌ వద్ద వాహన తనిఖీలు చేప ట్టారు. విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న అశోక్‌ లీలాండ్‌ గూడ్స్‌ వాహనాన్ని ఆపి పారిపోతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సరుకు, వాహనం, సెల్‌ఫోన్‌ స్వాఽధీ నం చేసుకున్నారు. వారిని విచారించగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజాఫర్నగర్‌ జిల్లా క టౌలి మండలం ఖోకాని గ్రామానికి చెందిన 36 ఏళ్ల మహ్మద్‌ షాహిద్‌, అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల రోహిత్‌ శర్మగా గుర్తించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌, ఎస్‌ఐ టి.రఘునందనరావు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

చోరీ కేసులో 624 గ్రాముల బంగారం స్వాధీనం

కాకినాడ క్రైం: ఓ దాబా వద్ద ఆగి ఉన్న బస్సులో ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను తెరచి అందులోని సుమారు రూ.60 లక్షల విలువైన 624 గ్రాముల బంగారాన్ని అగంతుకులు ఈ ఏడాది సెప్టెంబరు 10న తస్కరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగ్గంపేట సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా గండేపల్లి మండలంలో ముగ్గురు అనుమానాస్పదంగా సంచరిస్తుండడాన్ని గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విజయనగరానికి చెందిన పాతనేరస్తులు టి.నరసింహ, పి.తేజ, మహేందర్‌గా గు ర్తించారు. వారు చేసిన నేరా న్ని అంగీకరించినట్టు కాకినా డ జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.60 ల క్షల విలువైన 5 జతల బం గారు గాజులు, 44 జతలు చెవిలీలు మెత్తం 624 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఎస్‌బీ డీఎస్పీ కెవి సత్యనారాయణ, పెద్దాపురం ఎస్‌డీపీవో శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:23 AM