తవుడు కింద గంజాయి బస్తాలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:47 AM
చింతూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చింతూరు పోలీసులు బుధవారం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ర మేష్ కఽథనం మేరకు... ఒడి
పట్టుకున్న చింతూరు పోలీసులు
రూ.6 లక్షల విలువైన 120 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్ట్
చింతూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చింతూరు పోలీసులు బుధవారం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ర మేష్ కఽథనం మేరకు... ఒడిస్సా రాష్ట్రం మల్కన గిరి జిల్లా ఎంవీ 71 గ్రామానికి చెందిన బిశ్వజిత్ మండల్, సుధీప్ హల్దార్ 120 కిలోల గంజా యిని ఏపీలోకి తరలించేయత్నం చేశారు. బొలేరా వాహనంలో తవుడు లోడు వేసుకుని ఆ లోడు కింద భాగంలో ఎవరికీ అనుమానం కల గకుండా గంజాయి బస్తాలను పేర్చారు. కాగా ఒడిస్సా జంక్షన్‌లో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నా మని ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.