Share News

ఆర్థిక సమానత్వ సాధనే పీ4 లక్ష్యం

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:35 AM

ఆర్థిక సమానత్వం సాధన లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో పీ4 మార్గదర్శి-బంగారు కుటుంబాలు కార్యక్రమాన్ని ప్ర భుత్వం చేపట్టిందని, ఆ దిశగా జిల్లా పరిఽదిలో మార్గదర్శుల గుర్తింపు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి సూచించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో శనివారం సాయంత్రం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో ఆమె సమీక్ష నిర్వహించారు.

ఆర్థిక సమానత్వ సాధనే పీ4 లక్ష్యం
పారిశుఽఽధ్య కార్మికులకు సర్టిఫికెట్‌ అందించి అభినందిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంతి

  • బంగారు కుటుంబం నిర్మాణంలో భాగస్వాములుకండి

  • తహశీల్దార్‌, ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం సిటీ, జూలై 26(ఆంధ్ర జ్యోతి): ఆర్థిక సమానత్వం సాధన లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో పీ4 మార్గదర్శి-బంగారు కుటుంబాలు కార్యక్రమాన్ని ప్ర భుత్వం చేపట్టిందని, ఆ దిశగా జిల్లా పరిఽదిలో మార్గదర్శుల గుర్తింపు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి సూచించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో శనివారం సాయంత్రం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో ఆమె సమీక్ష నిర్వహించారు. జీవితంలో ఎదగాలంటే తోడు నిలిచే వారు అవసరమన్నా రు. ఒక మార్గదర్శి ఒక కుటుంబాన్ని లేదా మరి న్ని కుటుంబాలను దత్తత తీసుకోవచ్చ న్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి లో ఉన్న అధికారులు నిష్టతో పనిచేసి మార్గదర్శుల గుర్తింపు, కుటుంబాల ఎంపిక క్షేత్రస్థాయిలో వేగవంతంగా జరిగేలా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఇతర అధికారులతో సమన్వయం, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వా మ్యం చేయాలని సూచించారు. తాను ఒక కుటుంబాన్ని పీ4 ద్వారా దత్తత తీసుకున్నట్టు ప్రతి అధికారి, ఉద్యో గులు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని వారి సమగ్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా ముఖ్యప్రణాళిక అధి కారి ఎల్‌.అప్పలకొండ, ఆర్డీవోలు ఆర్‌.కృష్ణనాయక్‌, రాణి సుస్మిత, తహశీల్దార్లు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

  • స్వచ్ఛత జీవన విధానంలో భాగం..

స్వచ్ఛత ప్రతిఒక్కరి జీవన విధానంలో భా గం కావాలని జిల్లా కలెక్టర్‌, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు ప్రతిష్టాత్మక ప్రామిసింగ్‌ స్వచ్ఛ్‌ షహర్‌ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఈ అవా ర్డు రావడానికి కారకులైన ఉత్తమ కార్మికులు, అధికారులకు శనివారం రాత్రి స్థానిక ఆనం కళా కేంద్రంలో సత్కారం జరిగింది. దీనికి కలెక్టర్‌తో పాటు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పశ్చిమ దేశాల్లో రోడ్లు, డ్రైన్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయని, కానీ ఇక్కడ రోడ్లు పైన చెత్త, కాలువల్లోను ప్లాస్టిక్‌ వ్యర్థాలు దర్శనమిస్తుంటాయన్నారు. పౌరులు ఒక బాధ్యతగా తీసుకుని రోడ్లుపై, కాలువలో చెత్త వేయకపోవడం పారిశుధ్య కార్మికులకు మనమిచ్చే గౌరమని కలెక్టర్‌ అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక దేశం స్వచ్ఛత వైపు పయనిస్తోందన్నారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి ప్రా మిసింగ్‌ స్వచ్ఛ షెహార్‌ అవార్డు రావడం గర్వకారణమన్నారు. 2025లో మొదటి స్థానం సాధించే దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులను, శానిటేషన్‌ విభాగ అధికారులను సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ స్టేట్‌ చై ర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, నాయిబ్రాహ్మణ కా ర్పొరేషన్‌ డైరెక్టర్‌ యానపు యేసు, కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణ, శైలజవల్లి, ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న, ఎండీ అబ్బుల్‌ మాలిక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 01:35 AM