మార్కెట్లు..కళకళ!
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:05 AM
తల్లికి వందనం డబ్బులతో జూన్ నెల టెన్షన్ నెమ్మదించడంతో కుటుంబమంతా ఆనందంగా కనిపిస్తున్నారు. దీనికి నగరాల్లోని ప్రధాన మా ర్కెట్లే నిదర్శనంగా చెప్పవచ్చు.
జనం జేబుల్లో కాసులు గలగల
ఆదివారమైనా రద్దీగా మార్కెట్లు
పట్టణాలకు పల్లెవాసుల క్యూ
చిన్నారుల్లో ఆనందం
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
తల్లికి వందనం డబ్బులతో జూన్ నెల టెన్షన్ నెమ్మదించడంతో కుటుంబమంతా ఆనందంగా కనిపిస్తున్నారు. దీనికి నగరాల్లోని ప్రధాన మా ర్కెట్లే నిదర్శనంగా చెప్పవచ్చు. రాజమ హేంద్రవరంలో పెద్ద బజారుకు వచ్చిన పలువురిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా.. తల్లికి వందనం సమయానికి అందడంతో తన ఇద్దరు మనవళ్లతో బజారుకు వచ్చానని సెయింట్ ఆన్స్‌లో చదువుతున్న విద్యార్థుల బామ్మ చెప్పారు. సీఎం చంద్రబాబు తన పిల్లలకు ఇచ్చిన డబ్బులతో వాళ్లకే సైకిల్ కొనడానికి వచ్చానని కొంతమూరుకు చెందిన ఆటో డ్రైవర్ ప్రసాద్ ఆనందంగా చెప్పారు. ఇలా తల్లికి వందనం సొమ్ములు సమయానికి పడడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆనందంగా ఖర్చు చేస్తున్నారు..దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో ఆదివారం పెద్ద ఎత్తున రద్దీ కొనసాగింది. మార్కెట్లు కళకళలాడాయి..ఎటు చూసినా షాపులు జనంతో నిండిపోయాయి.. ఆదివార మైనా ఎక్కడా ఖాళీ లేదు.. పిల్లాపాపలతో పట్ట ణాలకు చేరుకుని చాలా మంది షాపింగ్ చేసే పనిలో పడ్డారు. సోమవారం నుంచి విద్యార్థులు పూర్తిస్థాయిలో పాఠశాలలకు వెళ్లేందుకు సన్నద్ధ మవుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు షాపింగ్ చేసే పనిలో పడ్డారు. ఎక్కువగా బట్టల షాపులు,షూమార్ట్‌లు, బ్యాగ్‌ల దుకా ణాలు, పుస్తకాల షాపులు కిటకిటలాడాయి. మరో వైపు ఫర్నిచర్ షాపులదీ అదే పరిస్థితి. ప్రతి ఆదివారం వాణిజ్యనగరం రాజమహేంద్ర వరంలో ఈ షాపులు మూసివేసే ఉంటాయి. ఈ ఆదివారం ప్రత్యేకంగా తెరుచుకున్నాయి.
వ్యాపారుల ఆనందం..
‘చాలా నెలల నుంచీ పెద్దగా బేరాలు లేవు. ఇవాళే కాస్త కుదుట పడుతున్నాం’ అని ఓ వ్యాపారి అన్నాడంటే మార్కెట్లలో కళను అర్థం చేసుకోవచ్చు. మూడు జిల్లాల్లో చూస్తే అమలా పురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో ప్రధా నంగా మార్కెట్లు ఉంటాయి. కొద్ది నెలలుగా ఈ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఈ ఆదివారం మాత్రం ఈ మార్కెట్లు రద్దీగా కనిపించాయి. ఎక్కువగా స్కూల్‌కి సంబంధించిన అవసరాల దుకణాల వద్ద జాతర మాదిరిగా జనం హడా వుడి ఉంది. దీంతో వ్యాపారులు కూడా కాస్త హుషారుగా అమ్మకాలు సాగించారు. ఆదివారం కావడంలో పెద్ద షోరూమ్‌లకు మూత వేస్తారు. గతంలో మంగళవారం సెలవుగా ఉండేది. ఆది వారం ఉద్యోగులకు, పాఠశాలలకు సెలవు కావ డంతో ఆ రోజున బేరం ఎక్కువగా ఉంటుందని మంగళవారం సెలవు పుచ్చుకోవడం ఉండేది. అయితే కొన్నాళ్లుగా ఆదివారం మూసేస్తున్నారు. అయితే సండే సామాన్యుడి మార్కెట్ల దెబ్బకు బేరాలు ఉండడం లేదనే ఇబ్బందితో కూడా పెద్ద షాపులు కట్టేస్తున్నారు. అక్కడక్కడా తెరిచి ఉన్న షోరూంలలో జనం టీవీలు, ఫ్రిజ్‌లు, బీరువాల వంటి ఉపకరణాలు, వంట గది సామగ్రి కొను గోలు చేస్తూ కనిపించారు. డి.మార్ట్, రిలయన్స్, మోర్, విశాల్ తదితర షాపింగ్ మాల్స్ అయితే జనంతో రద్దీగా కనిపించాయి. ఉదయం నుంచి రద్దీ కొనసాగింది. ఇసుకేస్తే రాలనంతగా జనం తో నిండిపోయాయి. ఈ ఆదివారం వ్యాపారం డబుల్ జరిగిందనేది ఒక మేనేజర్ వాదన. కాస్త డబ్బులు ఖాతాలో ఉండడం..నాలుగు రోజులు గడిస్తే వాటికి కాళ్లు వచ్చేస్తాయనే భయంతో ఇంట్లోని ఆడవారు అవసరమైన వస్తు వులు /సామగ్రిపై దృష్టి సారించినట్టు తెలు స్తో ంది.మరోవైపు చిన్న చిన్న అప్పులను తీర్చుకోవ డానికి తల్లికి వందనం సహకరించింద ని పలు వురు వెల్లడించారు.బంగారం వస్తువుల కొను గోలుపై కొందరు మహిళలు దృష్టి సారించారు. ఇలా తల్లికి వందనం సొమ్ములు అందరికీ ఉపకరించడంతో ఆనందంగా ఉన్నారు.
కుదుటపడిన బడ్జెట్..
ఏడాదిలో జూన్ నెల వచ్చిందంటే కుటుంబ బడ్జెట్‌కి దడ పట్టుకుం టుంది. ఒక్కో విద్యార్థికి ఎలా లేద న్నా రూ.10వేల వరకూ ఖర్చు తప్పదు.చంద్రన్న పుణ్యమా అని ఆ డబ్బులకు వెతుకులాడుకునే పరిస్థితి తప్పింది. జూన్‌లో స్కూల్ ఖర్చులతో మెయింట్‌నెన్స్ డబుల్ అవు తుంది.ఓ వైపు ఫీజులు కట్టుకొని మరో వైపు బ్యా గులు,షూలు, పుస్తకాలకు వెచ్చించాలి. ఎంతో కొంతలో కొత్త బట్టలు.. ఇతర ఖర్చులు మామూలే.దీంతో ఈ నెల వచ్చే సరికి సామా న్యుల బుర్ర అప్పు లోళ్ల చుట్టూ తిరుగుతుంది. ఎంతో కొంత చేబదులు పుచ్చుకుంటేనే గానీ ఖర్చులు గట్టెక్కని పరిస్థితి. తీరా స్కూలు అవస రాలు తీరాయని సేద తీరడానికి ఉండదు. నెలం తా ఇల్లు గడవాలి కదా!..అయితే ప్రభుత్వం దయ చూపడంతో పేద లు, మధ్య తరగతి జీవితాలకు ఈ నెలలో రుణం పుచ్చుకునే అవస రత తప్పింది. సీఎం చంద్రబా బు తన హామీని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుండడంతో హుషారుగా బజా రుకు వెళ్లి ఉత్సా హంగా అన్నీ కొనేసి పిల్లల ఆనందంలో తమ సంతోషాన్ని చూసుకుంటున్నా రు. ఖాతాల్లో డబ్బులు గలగల లాడడంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.