నూరు ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:50 AM
పదో తరగతి ఫైనల్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థు లకు బోధన చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా సూచించారు.
అంబాజీపేట, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫైనల్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థు లకు బోధన చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా సూచించారు. అంబాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌ను గురువారం సా యంత్రం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లా లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామన్నారు. వారి కోసం ఉపాధ్యాయులు అదనంగా రెండు గంటలపాటు పనిచేసి వారికి ప్రత్యేక క్లాసుల ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకూ, సాయంత్రం 4 గం టల నుంచి 5 గంటల వరకూ ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 91 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు. ఈ ఏడాది నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆదేశించినట్టు తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలతో చదివించాలన్నారు. పాఠశాలకు రానివారిపై ప్ర త్యేక నిఘా పెట్టాలన్నారు. అవసరమైతే వారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వా లన్నారు. అనంతరం విద్యార్థుల నోట్‌బుక్స్, వర్కులను పరిశీలించారు. ఉపాధ్యాయులు అర్థ మయ్యే రీతిలో బోధిస్తున్నారా లేదా అని విద్యార్థులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ వోలు కె.వెంకటేశ్వరరావు, ఎం.ప్రకాష్, హెచ్‌ఎం సాయిరాం, పీడీ కె.ఆదిలక్ష్మి పాల్గొన్నారు.