సత్యదేవుడి సన్నిధిలో ఉచిత బస్సు ప్రారంభం
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:53 PM
అన్నవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులకు రత్నగిరి నుంచి సత్యగిరి కొండకు చేరుకునేందుకు అరబిం
అన్నవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులకు రత్నగిరి నుంచి సత్యగిరి కొండకు చేరుకునేందుకు అరబిందో ఫార్మా అందజేసిన ఉచిత బస్సును శనివారం ప్రత్తి పాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంబించారు. ఆమె మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా భక్తుల ఇబ్బందులు తెలుసుకుని వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు ఆమె స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.