Share News

ఆలోచించండి..అమ్మా నాన్న!

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:53 AM

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు.. అవును ఇది నిజమే.. ఆ తల్లి నవమాసాలు కష్టపడి మోయాల్సిన అవసరం లేదు.. ఆసు పత్రుల చుట్టూ తిరగాల్సిన పనీ లేదు..కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే అమ్మా నాన్న స్థానం దక్కుతోంది.. బిడ్డను ప్రేమగా పెంచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే.. ఒక చిన్నారిని దత్తత తీసుకోవడమే.. అదీ శాశ్వతంగా కాదండోయ్‌.. రెండేళ్ల పాటు ఆ చిన్నారిని ప్రేమగా చూడండి..

ఆలోచించండి..అమ్మా నాన్న!

  • కలిసొచ్చే కాలానికి.. నడిచొచ్చే పిల్లలు

  • సరోగసి సెంటర్లకు ఎందుకు దండగ

  • నవమాసాలు మోయనక్కర్లెద్దు

  • దత్తత తీసుకోండి మనసు నిండుగా

  • కేంద్ర ప్రభుత్వం పోస్టర్‌ కేర్‌ స్కీమ్‌

  • రెండేళ్లకు తాత్కాలిక దత్తత

  • ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలు

  • నచ్చితేనే శాశ్వత అడాప్షన్‌

  • ఎవరికి నచ్చకపోయినా రద్దు

  • ఆత్మీయతను పెంచడమే లక్ష్యం

  • కారా వెబ్‌సైట్‌లో దరఖాస్తు

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు.. అవును ఇది నిజమే.. ఆ తల్లి నవమాసాలు కష్టపడి మోయాల్సిన అవసరం లేదు.. ఆసు పత్రుల చుట్టూ తిరగాల్సిన పనీ లేదు..కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే అమ్మా నాన్న స్థానం దక్కుతోంది.. బిడ్డను ప్రేమగా పెంచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే.. ఒక చిన్నారిని దత్తత తీసుకోవడమే.. అదీ శాశ్వతంగా కాదండోయ్‌.. రెండేళ్ల పాటు ఆ చిన్నారిని ప్రేమగా చూడండి.. నచ్చిందా శాశ్వతంగా దత్తత తీసుకోవచ్చు.. లేదంటే మళ్లీ వెనక్కు ఇచ్చేయవచ్చు. ఈ మేరకు కేంద్రం ఫోస్టర్‌ కేర్‌(తాత్కాలిక సంరక్షణ) అంటూ ఒక కొత్త పథకం అందుబాటులోకి తెచ్చిం ది..అమ్మా నాన్న ఆలోచించండి..సరోగసి సెంటర్లకు ఎందుకు దండగ..‘ఒక బిడ్డను దత్తత తీసుకోండి’.పిల్లలు లేరని ఎంతో మంది బాధపడుతుం టారు.. మొక్కని దేవుడు ఉండడు..వెళ్లని ఆల యం ఉండదు.. వేసుకోని మందులు ఉండవు.. దేవుడిపై భారం వేసి సూటిపోటి మాటలు పడుతూ నిత్యం కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తూ ఉం టారు.బిడ్డలు కావాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.పలువురు లక్షలు తగ లేసి సరోగసీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు.. మా రక్తమే కావాలంటూ పట్టుబడుతుంటారు.. ప్రస్తుతం సరోగసీ ఆసుపత్రుల్లో మాయాజాలం చూస్తుంటే అసలు పుట్టిన బిడ్డ ఎవరి బిడ్డ అనే ఆలోచన రాక మానదు.అంత కష్టపడి.. ఆరోగ్యం పాడు చేసుకుని బిడ్డను కనాలా.. ఒకరిని దత్తత తీసు కుని పెంచుకుంటే బిడ్డకాడా..? 9 నెలలు మోసి కంటేనే బిడ్డ అవుతుందా? ప్రేమగా పెంచినా బిడ్డే కదా.. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచించింది.. ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది..అనాథాశ్రమంలో బిడ్డను దత్తత తీసు కున్నా జీవితాంతం పెంచాల్సిన అవసరం లేదు. మొదట రెండేళ్ల పాటు పెంచవచ్చు.. మ నకు అన్నీ నచ్చితేనే శాశ్వతంగా దత్తత తీసుకో వచ్చు. లేదంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చా రో అక్కడే వదిలేయవచ్చు. సంతానం లేని తల్లిదండ్రులు..అమ్మానాన్నల ప్రేమానురాగాలు అం దు కోలేని పిల్లలకు మధ్య ఆత్మీయ అనుబంధాన్ని కల్పిస్తూ.. తల్లిదండ్రుల ఆదరణ లేని పిల్లలకు తాత్కాలిక సంరక్షణ అందించే వ్యవ స్థను కేం ద్ర ప్రభుత్వం తెచ్చింది. అదే ఫోస్టర్‌ కేర్‌.

అమ్మా నాన్నలకో అవకాశం..

6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను రెండేళ్లపాటు పెంచి..అనంతరం శాశ్వతంగా దత్తత పొందే అవకాశం ఈ పోస్టర్‌ కేర్‌ ద్వారా కలుగుతోంది.పిల్లలు వివిధ కారణాల వల్ల తమ కుటు ంబాలకు దూరంగా ఉన్నప్పుడు ఫోస్టర్‌ అడాప్షన్‌ తల్లిదండ్రులు, వారి ప్రేమ, ఆప్యాయత అం దించాలి.పిల్లలను ప్రేమగా పెంచాలి. విద్య, ఆరో గ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అటువంటి బాలబాలికలు, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే గుర్తించే పనిలో జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమశాఖ అధికారులు ఉన్నారు. అభాగ్యులు, అనాథలకు ఈ పథకం ఒక వరమని చెప్పొచ్చు. కొన్ని రోజుల పాటు తమకు నచ్చిన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది. సంతానం లేని తల్లిదండ్రులకు అమ్మా నాన్న అని పిలిపించుకునే అవకాశం ఉంది.

ఎవరు అర్హులంటే..

దత్తత తీసుకునే వ్యక్తి కచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండ కూడదు. భావోద్వేగాల నియంత్రణ లేని వ్యక్తు లకు దత్తత ఇవ్వరు. ఫోస్టర్‌ కేర్‌ ఆశించే తల్లిదండ్రులు ఆర్థికంగా సామర్థ్యం కలిగి ఉండాలి. ఏదైనా నేరపూరిత చర్యలో దోషిగా నిర్ధారించి ఉండకూడదు. పిల్లల హక్కుల ఉల్లంఘన కేసుల్లో నిందితులు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దత్తత తీసుకోవడానికి అనర్హులు.

దరఖాస్తు.. చేయండిలా..

పిల్లలు లేని దంపతులు, పిల్లలు ఉండి ఇంకా కొంతమందిని పెంచగలం అనుకునే వారు ఈ పోస్టర్‌ కేర్‌ ద్వారా రెండేళ్ల కాలపరిమితితో తాత్కాలిక దత్తత పొందవచ్చు. రెం డేళ్లు పూర్తయిన తర్వాత ఇరువురికి సమ్మతమైతే తాత్కాలిక దత్తత కొనసాగించొచ్చు. పోస్టర్‌ కేర్‌కు ఆన్‌లైన్‌లో ఠీఠీఠీ.ఛ్చిట్చ.ుఽజీఛి. జీుఽలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. ప్రస్తుత కుటుంబ ఫొటో, గుర్తింపు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు అందించాలి. మెడికల్‌ సర్టిఫికెట్‌తో పాటు ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి. దంపతులైతే వివాహ ధ్రువీకరణ పత్రం, వేరుపడితే విడాకుల కోర్టు ఆదేశాలు, సమాజంలో పే రు న్న ఇద్దరు వ్యక్తుల హామీ అవసరం. గ్రూప్‌ ఫోస్టర్‌ కేర్‌ అవకాశం ఉంది. 8 మంది వరకు పిల్లలను గ్రూపుగా దత్తత తీసుకునే అవకాశం ఉంది.రెండేళ్ల వ్యవధిలో పిల్లల ఇష్టం లేదా పెంచిన వ్యక్తుల పెంపకం సరిగా లేదని నిర్ధారణకు వస్తే తక్షణమే దత్తత రద్దు చేస్తారు. గతంలో నుంచి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 నెలల వయసు ఉన్న అనాథలను దత్తత ఇచ్చేవారు పోస్టర్‌ కేర్‌లో బాలల సంరక్షణ, వసతి గృహాల్లో మగ్గిపోతున్న పిల్లలను కారా అనే వెబ్‌సైట్‌ ద్వారా దత్తత తీసుకోవచ్చు.

దత్తత ఇచ్చేది వీరినే..

6- 12 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 12-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రుల వయసు 35-60 ఏళ్ల మధ్య ఉండాలి. చిన్నపిల్లలను దత్తత తీసుకుంటే ఆ బాలల సంరక్షణకు ఒక్కొ క్కరికి నెలకు రూ.4 వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మొత్తం బాలల విద్య, ఆరోగ్యపరమైన అవసరాల కోసం వెచ్చించాల్సి ఉంది. సోదర, సోదరి బంధాలతో ముడిపడి ఉన్న అనాథలను విడదీయరు.

అనాథలకు అమ్మా నాన్నను ఇస్తాం..

అనాథ బాలల జీవితాలకు తల్లిదండ్రుల ప్రేమను అందించడంతో పాటు దంపతుల జీవితాల్లో పిల్లలు లేని లోటు తీర్చి వారి జీవితాలను సంపూర్ణం చేయడమే పోస్టర్‌ కేర్‌ లక్ష్యం. ఈ పథకం ఎంతో మందికి పిల్లలు లేని లోటు తీర్చుతుందనడంతో సందేహం లేదు.

- సీహెచ్‌ వెంకట్రావు, కాకినాడ జిల్లా బాలల పరిరక్షణాధికారి

ఇది తాత్కాలిక దత్తత విధానం

పోస్టర్‌ కేర్‌ తాత్కాలిక దత్తత ప్రక్రియ. దీన్ని శాశ్వత దత్తత విధానంగాను మార్చుకోవచ్చు.దత్తత కావాలనుకునే వారు బాలల పరిరక్షణ అధికారి సీహెచ్‌ వెంకట్రావును, జిల్లా బాలల సంరక్షణాధికారి కె.విజయను సంప్రదించాలి.

- సీహెచ్‌ లక్ష్మి, పీడీ, ఐసీడీఎస్‌ కాకినాడ జిల్లా

Updated Date - Aug 10 , 2025 | 01:53 AM