మూగజీవాల ‘మిత్ర’
ABN , Publish Date - May 11 , 2025 | 11:45 PM
కొద్ది రోజులు గా సూర్యుడు భగభగలాడుతున్నాడు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండ వేడిమిని మనుషులు, మూగ జీవాలు తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా పశుపక్ష్యాదులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎంత దూరమైన వెళ్లి దప్పిక తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాగునీటి కోసం మూగజీవాలు చేస్తున్న అన్వేషణను కళ్లారా చూసి చలించిపో యిన ఓ చిరుద్యోగి వాటి దప్పిక తీర్చేందుకు తనవంతు సహకారం చేస్తున్నాడు.
రంపయర్రంపాలెం-తిరుమలాయ పాలెం రోడ్డులో నీటితొట్టెలు
గోపాలమిత్ర సేవా తత్పరత
అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్న చిరుద్యోగి
గోకవరం, మే 11(ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులు గా సూర్యుడు భగభగలాడుతున్నాడు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండ వేడిమిని మనుషులు, మూగ జీవాలు తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా పశుపక్ష్యాదులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎంత దూరమైన వెళ్లి దప్పిక తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాగునీటి కోసం మూగజీవాలు చేస్తున్న అన్వేషణను కళ్లారా చూసి చలించిపో యిన ఓ చిరుద్యోగి వాటి దప్పిక తీర్చేందుకు తనవంతు సహకారం చేస్తున్నాడు.
గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రా మానికి చెందిన గంటా వెంకటేశ్వరరావు పశుసం వర్ధకశాఖలో గోపాలమిత్రగా కొన్నేళ్ళుగా పని చేస్తున్నాడు. అతడికి మూగజీవాలంటే ఎనలేని ప్రేమ. ఇతను నివసించే స్వగ్రామాన్ని ఆనుకొని తిరుమలాయపాలెం వెళ్లే దారిలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆప్రాంతంలో ఉన్న నీటికుంటలు, చెరువులు అడు గంటిపోవడంతో మూగ జీవాలు తాగునీటి కో సం అలమటిస్తున్న ట్టు గుర్తించాడు. వెంటనే సొంత డ బ్బులతో సిమ్మెం ట్ తొట్టెలను సి ద్ధం చేశాడు. రంప యర్రంపాలెం-తిరు మలాయపాలెం రోడ్డులో నీటితొట్టెలు ఏర్పాటు చేసి వా టిని నీటితో నింపుతున్నాడు. సుమారు వందకు పైగా సిమ్మెంట్ తొట్టెలను ఏర్పాటు చేశాడు. ప్రతీ రోజు సైకిల్‌పై వాటర్ టిన్ తీసుకెళ్లి తొట్టెలను నింపుతున్నాడు. తొట్టెల్లో నీటిని అనేక రకాల మూగజీవాలు తాగి దప్పిక తీర్చుకుం టుంటే అది కళ్లారా చూస్తున్న వెంకటేశ్వరరావు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కోతులు, ఉడతలు, దుప్పిలు, అడవి పందులతో పాటు వివిధ రకాల వన్యప్రాణులు ఈనీటిని తాగి సేద తీర్చుకుంటున్నాయి. సుమారు నాలు గేళ్ల నుంచి ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెంకటేశ్వరరావు చెబుతున్నారు. అయితే వన్య ప్రాణుల కోసం ఏర్పాటు చేస్తున్న నీటి తొట్టెలను కొంతమంది వ్యక్తులు దొంగిలించడం పట్ల వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేస్తున్నాడు.