లాభసాటి పంటలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:47 AM
లాభ సాటి పంటల సాగుపై దృష్టి సారించే విధంగా ఉద్యాన, వ్యవసాయాధికారులు రైతులను ప్రోత్స హించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధి కారులకు సూచించారు. నియోజకవర్గంలోని రా జానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలకు చెందిన ఉద్యాన, వ్యవ సాయ శాఖాధికారులతో ఆదివారం ఎమ్మెల్యే సమీ క్షా సమావేశం నిర్వహిం చారు.
ఉద్యాన, వ్యవసాయశాఖాధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
రాజానగరం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): లాభ సాటి పంటల సాగుపై దృష్టి సారించే విధంగా ఉద్యాన, వ్యవసాయాధికారులు రైతులను ప్రోత్స హించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధి కారులకు సూచించారు. నియోజకవర్గంలోని రా జానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలకు చెందిన ఉద్యాన, వ్యవ సాయ శాఖాధికారులతో ఆదివారం ఎమ్మెల్యే సమీ క్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభదా యకమైన పంటల సాగు పై మక్కువ చూపేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చాగ ల్నాడు సీతాఫలాలకు గతంలో మంచి గుర్తింపు ఉండేదని, వాటికి పూర్వ దశ తీసుకురావాల న్నారు. అలాగే జీడిమామిడి, మామిడి, నిమ్మ, నారింజ, సపోట తదితర పండ్ల తోటల సాగు లో అధిక దిగుబడులు సాధించే విధంగా రైతు లకు ఎప్పటికప్పుడు శిక్షణ, అవగాహన కల్పించా లన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండిం చిన ఫలితాలు పొందలేని వ్యవసాయం కంటే ఏ పంటలు పండిస్తే లాభసాటి అవుతుందో రైతు లకు వివరించాలన్నారు.సరైన అవగాహన కల్పిం చకపోవడం వల్లే మూస విధానంలో పండిస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని సూచించారు. లాభాలు కురిపించే ఆయిల్ పామ్ వంటి పంట లపై కూడా మక్కువ చూపేలా ఉద్యానశాఖాధి కారులు అవగాహన కల్పించాలన్నారు కలవచర్ల లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో ఫుడ్ ప్రో సెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని కూడా పండ్ల తోటల రైతులకు వివరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ సమా వేశంలో ఉద్యాన, వ్యవసాయశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.