వరద ఉధృతి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:26 AM
చింతూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఒడిస్సాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అల్లూరి జిల్లా చింతూరులో శబరి, సీలేరు నదులు ఉధృతం ప్రవహిస్తున్నాయి. కూనవరం వద్ద గోదావరి ఎగ పోటుతో సోమవారం వాగులు, వంకలు నిండు కుండల్లా దర్శ నమించాయి. దీంతో ఏపీ మీదుగా ఒడిస్సా వెళ్లే 326 జాతీయ రహదారిపై చింతూరు కుయు గూరుల వద్ద వరద నీరు భారీగా చేరింది. చింతూరు
ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఏజెన్సీలో నిండు కుండల్లా వాగులు
జల దిగ్బంధంలో 16 గ్రామాలు
నాటు పడవలపై ప్రయాణాలు
పరిస్థితిని సమీక్షిస్తున్న పీవో, ఏఎస్పీలు
చింతూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఒడిస్సాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అల్లూరి జిల్లా చింతూరులో శబరి, సీలేరు నదులు ఉధృతం ప్రవహిస్తున్నాయి. కూనవరం వద్ద గోదావరి ఎగ పోటుతో సోమవారం వాగులు, వంకలు నిండు కుండల్లా దర్శ నమించాయి. దీంతో ఏపీ మీదుగా ఒడిస్సా వెళ్లే 326 జాతీయ రహదారిపై చింతూరు కుయు గూరుల వద్ద వరద నీరు భారీగా చేరింది. చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే 30వ నెంబరు జాతీయ రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో 326వ నంబరు జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోగా 30వ నంబరు జాతీయ రహదారిపై సాహసించి రాకపోకలు సాగిస్తున్నారు. చింతూ రు, వరరామచంద్ర పురం మండలాల నడుమ సోకిలేరు, చీకటి వాగులు పొంగి పొర్లుతు న్నాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపో యాయి. చింతూరు మండలంలో 16గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. దీంతో ప్రజలు నాటు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి 38.20 అడుగులు, కూనవరం వద్ద గోదా వరి 32, చింతూ రు వద్ద శబరి 33 అడుగుల మేర ప్రవహి స్తున్నాయి. వరద పరిస్థితిని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా సమీక్షిస్తున్నారు. వాగులపై ప్రయాణిం చవద్దని ప్రజలకు సూచించారు. చింతూరు డివిజన్ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలకు చెందిన 16మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించినట్టు డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.