లంక గ్రామాల్లోకి వరద నీరు
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:23 AM
ఆలమూరు/ఆత్రేయపురం/కపిలేశ్వరపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గోదావరికి వరదనీరు పోటెత్తడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పుష్కర్‌ఘాట్‌లతోపాటు లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచేసింది. మండలంలోని జొన్నాడ, బడుగు
ఆందోళనలో రైతులు
పర్యటించిన అధికారులు
ఆలమూరు/ఆత్రేయపురం/కపిలేశ్వరపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గోదావరికి వరదనీరు పోటెత్తడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పుష్కర్‌ఘాట్‌లతోపాటు లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచేసింది. మండలంలోని జొన్నాడ, బడుగువానిలంక పుష్కర్‌ఘాట్లు మునిగిపోయ్యాయి. బడుగువానిలంక, మడికి, చెముడులంక, చొప్పెల్ల, మూలస్థానం, జొన్నాడ, ఆలమూరు లంక భూముల్లో వాణిజ్యపంటలు ముంపునకు గురయ్యాయి. మరింత పెరిగితే లంక గ్రామాల్లో పంటలకు భారీ నష్టం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జొన్నాడ వద్ద రెండు బ్రిడ్జిల మధ్య గోదావరి వరద ఉధృతిగా ప్రవాహిస్తుం ది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి గౌతమి, వశిష్ట నదులు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మం గళవారం సాయంత్రానికి బొబ్బర్లం క బ్యారేజీ వద్ద 12.40 అడుగులకు వరద నీరు చేరుకుంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రవాహం పెరగడంతో కపిలేశ్వరపురం మండలంలోని లంకగ్రామాలైన కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంక, అద్దం కివారిలంక, పల్లపులంకలో మంగళవారం తహశీల్దార్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటించింది. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వరద పరిసితులపై సమీక్ష నిర్వహించారు.