వదలని వరద..!
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:22 AM
చింతూరు/దేవీపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గోదావరి, శబరి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు చింతూరు వద్ద శబరి 34 అడుగుల మేర ప్రవహించింది. భద్రాచలంలో గోదావరి 50 అడుగుల నీటి మట్టం, కూనవరం వద్ద 46 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో విలీన మండలాల్లో ప
మళ్లీ పెరుగుతున్న గోదావరి, శబరి ఉధృతి
నీటిలోనే విలీన మండలాల గ్రామాలు
చెరువులను తలపిస్తున్న రహదారులు
నీటమునిగిన గండిపోశమ్మ ఆలయం
చింతూరు/దేవీపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గోదావరి, శబరి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు చింతూరు వద్ద శబరి 34 అడుగుల మేర ప్రవహించింది. భద్రాచలంలో గోదావరి 50 అడుగుల నీటి మట్టం, కూనవరం వద్ద 46 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో విలీన మండలాల్లో పలు ప్రధాన రహదారులపై వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వడ్డిగూడెం, కూనవ రం, పొట్లవాయి, మొరుమూరు తదితర గ్రామాల్లో లంక పొగాకు, మిర్చి నారుమడులు వరద పాలయ్యాయి. చింతూరు మండలంలో వరి సాగు నీటమునిగింది. చింతూరు డివిజను వ్యాప్తంగా 80 గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. దేవీపట్నం మండలంలో గోదావరి ముంపు పరీవాహాక ప్రాంతాలైన కొండమొదలు, పూడిపల్లి తదితర గ్రామాల్లో వరద నీరు చేరింది. పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండిపోశమ్మ ఆలయం పూర్తి గా మునిగిపోయింది. దండంగి వద్ద ఉన్న సీతపల్లి వాగుకు వరద నీరు చేరడంతో ప్రభుత్వ కార్యకలాపాలకు గండిపై ఉన్న 4పంచాయతీల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.