అదిగో..ఇండిగో..వచ్చేస్తోంది!
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:43 AM
వియాన ప్రయాణికులకు ఇబ్బం దులు తప్పడంలేదు. విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ఎయి ర్‌పోర్ట్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.
ఎంతకీ రాని విమానాలు
పలు సర్వీసులు రద్దు
ప్రయాణికుల ఇక్కట్లు
రాజమహేంద్రవరం, డిసెంబరు 5 (ఆం ధ్రజ్యోతి) : వియాన ప్రయాణికులకు ఇబ్బం దులు తప్పడంలేదు. విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ఎయి ర్‌పోర్ట్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఎప్పుడు విమానం వస్తుందో ఎప్పుడు బయ లుదేరుతుందో తెలియక అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో విమాన పైలెట్ల రెస్ట్ విషయంలో ఏర్పడిన వ్యవహారంతో కొన్ని విమానాలు రద్దవడంతో పాటు కొన్ని ఆల స్యంగా నడుస్తున్నాయి. దీంతో అనేక మంది ప్రయాణాలు మానుకోగా.. మరికొందరు వి మానాశ్రయాల్లో వేచి చూస్తున్నారు. రాజ మ హేంద్రవరం నుంచి అనేక మంది న్యూఢిల్లీ, ముంబయి,హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కు ప్రతీ రోజు వందలాది మంది విమా నా ల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఇండిగో విమాన సంస్థలో ఏర్పడిన సమస్యతో సర్వీ సులు ఆలస్యమవుతున్నాయి. పైలెట్ల కొరత తెరమీదకు వచ్చింది. ఇండిగో యాజమాన్యం పైలెట్లకు విశ్రాంతి ఇవ్వడంలేదని సమాచా రం బయటకు రావడంతో ఎయిర్‌పోర్టు అథార్టీ పైలెట్లకు విశ్రాంతి తప్పనిసరి చేసి నట్టు సమాచారం. దీంతో పైలెట్ల కొరత ఏర్పడి విమానాలు రద్దవుతున్నాయి. రాజమ హేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి,న్యూఢిల్లీ 11 విమానాలు రాక పోకలు సాగిస్తుంటాయి. తిరుపతికి రోజు విడిచి రోజు ఒక విమానం వెళ్లొస్తుంది.కానీ గురువారం నుంచి ఆకస్మికంగా విమానాలు రద్దవడం,ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.గురువారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి ముంబయి వెళ్లా ల్సిన 160 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలో జాగరణ చేశారు. రాత్రి 8.30 గంటలకు రావాల్సిన ముంబయి విమా నం శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వచ్చింది. తిరిగి ఐదు గంటలకు వెళ్లింది. ఎయిర్‌పోర్టు, విమాన సంస్థ అధికా రులు కొందరు ప్రయాణికులకు రాజమ హేంద్రవరంలో హోటల్ రూమ్‌లు బుక్ చే యగా, కొందరు ఇళ్లకు వెళ్లి వచ్చారు.రాజమ హేంద్రవరం విమానాశ్రయంలో గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు. ఇక శుక్ర వారం న్యూఢిల్లీ, ముంబయి విమానాల సర్వీసు రద్దయింది. బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమా నాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు నుం చి శుక్రవారం ఉదయం రావాల్సిన విమానం అర్ధరాత్రి 12 గంటలకు రావొచ్చని అధికారు లు చెబుతున్నారు.దీంతో సుమారు 70 మం ది ప్రయాణికులు ఈ రాత్రి కూడా ఎయిర్ పోర్టులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నై విమానం శుక్రవారం రావాల్సి ఉండగా శనివారం రానున్నట్టు సమాచారం. గురువా రం 670 మంది ప్రయాణం చేయగా.. శుక్రవారం బాగా తగ్గడం గమనార్హం.
4 విమాన సర్వీసులు రద్దు
మరో నాలుగు ఆలస్యం
కోరుకొండ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మధురుపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీ,హైదరాబాద్, బెంగళూరు,హైదరాబాద్‌లకు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన 4 విమాన సర్వీసులు శుక్రవారం రద్దయ్యాయి. అదే విధంగా మరో నాలుగు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. హైదరాబాద్- రాజమహేంద్రవరం మధ్య నడిచే విమాన సర్వీసు 45 నిమిషాలు, మద్రాసు- రాజమహేంద్రవరం మధ్య విమానసర్వీసు 30 నిమిషాలు,హైదరాబాద్- రాజమహేంద్రవరం మధ్య నడిచే విమాన సర్వీసు 1.15 గంటలు,హైదరాబాద్-రాజమహేంద్రవరం మధ్య నడిచే మరో విమాన సర్వీసు 2 గం టలు ఆలస్యంగా నడిచాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థకు దేశ వ్యాప్తంగా పైలెట్స్ కొరత కారణంగా ఈ సర్వీసులు రద్దు అయినట్టు తెలిసింది. త్వరలో సమస్య పరిష్కారమ వు తుందని అధికారులు చెబుతున్నారు.