అర్ధరాత్రి హాహాకారాలు..!
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:40 AM
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మం డలం రమణయ్యపేటలో దారుణం జరిగింది. పె ట్రోలు, డీజిల్ పోసి ప్లాటుకి నిప్పు పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్న వారిని అగ్నికి ఆహుతి చేసేందుకు యత్నించిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఉదంతంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనం రేకెత్తింది. వ్యక్తిగత కక్ష, ఆర్థిక లావాదేవీలే కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా
పెట్రోల్, డీజిల్‌తో ప్లాట్‌కి
నిప్పుపెట్టిన వైనం
ఆర్తనాదాలతో ప్రాణాలతో
బయటపడిన కుటుంబ సభ్యులు
కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో ఘటన
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మం డలం రమణయ్యపేటలో దారుణం జరిగింది. పె ట్రోలు, డీజిల్ పోసి ప్లాటుకి నిప్పు పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్న వారిని అగ్నికి ఆహుతి చేసేందుకు యత్నించిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఉదంతంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనం రేకెత్తింది. వ్యక్తిగత కక్ష, ఆర్థిక లావాదేవీలే కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వివరాల్లో కెళితే కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మండల పరిషత్ కా ర్యాలయం సమీపంలో గల గోపీకృష్ణా రెసిడెన్సీ లో మెకానిక్ పిల్లి సత్తిబాబు, భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నివసిస్తున్నారు. వారంతా భోజనం చేసి ఆదివారం రాత్రి 12 గం టల తర్వాత పడుకున్నారు. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గదిలో నుంచి పెట్రో లు, డీజిల్ వాసన రావడం, శ్వాస తీసుకోవ డంలో తీవ్ర ఇబ్బందిగా ఉండడంతో మెలుకువ వచ్చి సత్తిబాబు లేచి పరిశీలించగా, పెట్రోలు, డీజిల్ వాసనతో పాటూ మంటలు రావడాన్ని గుర్తించి కుటుంబ సభ్యులను లేపి తలుపులు తీసేందుకు ప్రయత్నించాడు. మంటలతో వీరి హాహాకారాలను గుర్తించిన సమీపం ప్లాట్స్ వాసు లు వచ్చి ఇంటి తలుపులు, అద్దాలు బద్దలు కొట్టి అతికష్టంపై సత్తిబాబు, భార్య దుర్గ, బాలికలు సృజన, భానుచంద్రిక, ఆరేళ్ల మణికార్తిక్‌ను బ యటకు ప్రాణాలతో తీసుకురాగలిగారు. మం టల్లో గదుల్లో ఉన్న ఫర్నీచర్, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంపై స్థాని కులు ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన అగ్నిమాపక వాహనంపై సిబ్బం ది వచ్చి మంటలను ఆర్పగలగడంతో పక్క పోర్ష న్‌లకు పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిం డర్ పేలి ఉంటే మరింత ప్రమాదం వాటిల్లి ఉం డేది. తాము నివసిస్తోన్న అపార్టుమెంట్ పెంట హౌస్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిపై అనుమా నం వ్యక్తం చేస్తూ బాధితుడు పిల్లి సత్తిబాబు సర్పవరం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. సర్పవరం సీఐ బి.గోవిందరాజు ఆదేశాల మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు సదరు వ్యక్తితో వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలపై పలుసార్లు తగాదాలు పడి నట్ట భావిస్తున్నామన్నారు. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అపార్టుమెంట్ పరిస ర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.