మత్స్యకారులు అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:27 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు అం దిపుచ్చుకుని మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్ చేకూరి కీర్తి, ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుకుని శుక్రవారం ఉదయం స్థానిక కంచర్ల లైన్ రేవు వద్ద గోదావరిలోకి 50 లక్షల చేప పిల్లలు, 5 లక్షల రొయ్య సీడ్‌ను విడుదల చేశారు.
గోదావరిలో చేప, రొయ్య పిల్లలను విడుదలచేసిన కలెక్టర్ కీర్తి, ఎమ్మెల్యే గోరంట్ల
ధవళేశ్వరం,నవంబరు21(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు అం దిపుచ్చుకుని మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్ చేకూరి కీర్తి, ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుకుని శుక్రవారం ఉదయం స్థానిక కంచర్ల లైన్ రేవు వద్ద గోదావరిలోకి 50 లక్షల చేప పిల్లలు, 5 లక్షల రొయ్య సీడ్‌ను విడుదల చేశారు. జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్. నిర్మలాకుమారి అధ్యక్షతన నిర్వహించిన కార్యకమ్రానికి కలెక్టర్ కీర్తి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిఽథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారవర్గాల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నా రు. జిల్లా పరిధిలో గుర్తింపు పొందిన సుమారు 4 వేల మంది మత్స్యకారులు వేటవృత్తిలో ఉన్నారని, అనేక మంది గుర్తింపు లేకుండానే వేట వృత్తిలోనే కొనసాగుతున్నారని తెలిపారు. అటువంటి వారి కుటుంబాల రిజిస్ట్రేషన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్య చౌదరి మాట్లాడుతూ గోదావరిలో వేటపై ఆధారపైడి జీవనం సాగించే మత్స్యకారులకు జీవనోపాధి పెంపొందించే విధంగా గోదావరిలో మత్స్య సంపద పెరిగేటట్లు ఏటా చేప పిల్లలను వదులుతున్నామన్నారు. అనంతరంం కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే గోదావరిలోకి చేప, రొయ్య పిల్లలను విడుదల చేశారు. ఆర్డీవో కృష్ణనాయక్, మత్స్యశాఖ, ఇతర అధికారులు పాల్గొన్నారు.