వైభవంగా తొలి ఏకాదశి పూజలు
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:48 AM
తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.: చారిత్రాత్మక కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు,పారాయణాలు, భజనలు జరిగాయి. కోరుకొండ గిరిప్రదక్షిణ బృందం ఆధ్వ ర్యంలో కొండ పొడవునా 650 మెట్లకు ఇరువైపులా దీపాలు వెలిగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు విష్ణు సహస్ర నామ, గోవిందనామ పారాయణం చేశారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులు
ప్రత్యేక పూజలు, అర్చనలు
కోరుకొండ, జూలై 6(ఆంధ్రజ్యోతి): తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.: చారిత్రాత్మక కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు,పారాయణాలు, భజనలు జరిగాయి. కోరుకొండ గిరిప్రదక్షిణ బృందం ఆధ్వ ర్యంలో కొండ పొడవునా 650 మెట్లకు ఇరువైపులా దీపాలు వెలిగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు విష్ణు సహస్ర నామ, గోవిందనామ పారాయణం చేశారు. గ్రా మపెద్దలు, రైతులు అర్ధ ఏకాహ భజన చేశారు. అలాగే హరేరామ సమాజం వద్ద సాయంత్రం మహిళా బృందం విష్ణు సహస్ర నామ పారాయణ, హరేరామ నామ సంకీర్తన , భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమం తా దీపాలు వెలిగించారు. అలాగే కాపవరం, పశ్చిమగోనగూడెం, బూరుగుపూడి, శ్రీరంగపట్నం, నర్సాపురం, గాదరాడ, తదితర గ్రామాల్లో తొలి ఏకా దశి భజనలు, ఏకాహా లు నిర్వహించారు. గ్రా మదేవతలకు పాయసాలు, కుడుములు, నైవేద్యాలు పెట్టి తొలి ఏకాదశిని తొలిపండగగా జరుపుకున్నారు.