Share News

తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - May 19 , 2025 | 12:23 AM

మామిడికుదురు, మే 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని ఓఎన్జీసీ జీసీఎస్‌లోని జనరేటర్‌లో ఆదివారం సాయ ంత్రం మంటలు ఏర్పడ్డాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల మంటలు ఏర్పడడంతో సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి అదుపు చేశా

తప్పిన పెను ప్రమాదం
నగరంలోని జీసీఎస్‌లో మంటలు

కోనసీమ జిల్లా నగరం జీసీఎస్‌ వద్ద జనరేటర్‌లో మంటలు

అదుపుచేసిన ఓఎన్జీసీ సిబ్బంది, ఊపిరి పీల్చుకున్న స్థానికులు

మామిడికుదురు, మే 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని ఓఎన్జీసీ జీసీఎస్‌లోని జనరేటర్‌లో ఆదివారం సాయ ంత్రం మంటలు ఏర్పడ్డాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల మంటలు ఏర్పడడంతో సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి అదుపు చేశారు. జనరేటర్‌లోని మంటలతో పాటు పక్కనే ఉన్న ఎండుగడ్డి అంటుకోవడంతో స్థానికులు భయా ందోళన చెందారు. ఓఎన్జీసీకి చెందిన ఫైర్‌ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. జీసీఎస్‌కు నిత్యం సుమారు 13 బావుల నుంచి ముడి చమురు, సహజ వాయువు సరఫరా అవుతోంది. జనరేటర్‌లో మంటలు చెలరేగడంతో ఆయా బావుల్లోని కొన్నింటిని నుంచి ఉత్పత్తిని నిలిపేశారు. జనరేటర్‌లో మంటలు ఏర్పడ్డాయా లేదా పైపులైను లీకై మంటలు ఏర్పడ్డాయాఅని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - May 19 , 2025 | 12:23 AM