Share News

దోసకాయపల్లిలో ఘోర అగ్నిప్రమాదం

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:59 AM

కోరుకొండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లిలో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జుత్తుక రామలక్ష్మికి చెందిన 2పాకలు కాలిపోగా వాటిలో ఉన్న 40 మేకలు, ఒక గేదె దూడ సజీవ దహనం అయ్యాయు. అదే విధంగా గరికపాటి సత్తిబాబుకు చెందిన మరొ

దోసకాయపల్లిలో ఘోర అగ్నిప్రమాదం
కాలిపోయిన మేకలు

3 పాకలు, 2 గడ్డి వాములు దగ్ధం

40 మేకలు, ఒక గేదె దూడ సజీవదహనం

కోరుకొండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లిలో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జుత్తుక రామలక్ష్మికి చెందిన 2పాకలు కాలిపోగా వాటిలో ఉన్న 40 మేకలు, ఒక గేదె దూడ సజీవ దహనం అయ్యాయు. అదే విధంగా గరికపాటి సత్తిబాబుకు చెందిన మరొక పాక, పుట్టా శ్రీనుకు చెందిన మూడు గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయం 10.30గంటల సమయంలో జుత్తుక రామలక్ష్మి, గరికపాటి సత్తిబాబు పశువుల మేత కోసం గడ్డి కోయడానికి పొలానికి వెళ్లారు. అయితే రామలక్ష్మి కూతురు ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో బయటకు పరుగులు తీసింది. ముందుగా పాకల నుంచి గడ్డివాములకు మంటలు అంటుకున్నాయి. ఒక పాకలో మేకలన్ని కట్టేసి ఉండటం వల్ల అవి తప్పించుకోవడానికి వీలు లేకుండా సజీవ దహనం అయ్యాయి. ప్రమాదానికి కారణం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని కొందరు, గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని మరికొందరు చెప్తున్నారు. నష్టం భారీగా జరిగింది. కూలీ పని చేసుకుని మేకలు మేపుకుంటున్న రామలక్ష్మి కుటుంబం వీధినపడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు, సర్పంచ్‌ ధారా యశోదమ్మ, ధారా రాంబాబు, కూటమి నాయకులు, సీఐ సత్యకిషోర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - Oct 12 , 2025 | 12:59 AM