Share News

రత్నగిరిపై అగ్నిప్రమాదం

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:43 AM

అన్నవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శుక్రవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్టు సర్క్యూట్‌ కారణంగా ఫ్యాన్సీషాపు గొడౌన్‌ అగ్నికి ఆహు తైంది. ఈ మంటలు పక్కనున్న రెండు గొడౌన్‌లకు వ్యాపించగా అక్కడ స్వల్ప నష్టం

రత్నగిరిపై అగ్నిప్రమాదం
పశ్చిమ రాజగోపురం వద్ద దగ్ధమవుతున్న గొడౌన్‌

ఫ్యాన్సీషాపు గొడౌన్‌ దగ్ధం

రూ.10 లక్షల ఆస్తినష్టం

అన్నవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శుక్రవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్టు సర్క్యూట్‌ కారణంగా ఫ్యాన్సీషాపు గొడౌన్‌ అగ్నికి ఆహు తైంది. ఈ మంటలు పక్కనున్న రెండు గొడౌన్‌లకు వ్యాపించగా అక్కడ స్వల్ప నష్టం కలిగింది. తుని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజిన్‌ సహాయంతో మంట లను అదుపు చేశారు. ఫ్యాన్సీషాపును మార్నీడి భాస్కరరావు లైసెన్స్‌ హక్కుపొందారు. సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈవో వీర్ల సుబ్బారావు, పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి పరిశీలించారు. దీనిపై నివేదికను దేవదాయ కమిషనర్‌కు పంపుతామని లీజుల విభా గం అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు గొడౌన్‌ కేటాయించారా లేదా అనేదానిపై ఈవో సంబంధిత అధికారులను అడగగా సంబంధింత ఫైలు కనిపించలేదని చెప్పినట్టు సమాచారం.

Updated Date - Sep 27 , 2025 | 12:43 AM